
Aamir Khan : బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను టార్గెట్ చేస్తూ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా పోస్ట్, ఆడియో క్లిప్ ద్వారా ఆ గ్యాంగ్‌కు చెందిన ఆర్యూ బిష్ణోయ్, టైసన్ బిష్ణోయ్ అమీర్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరించారు. సల్మాన్ ఖాన్‌కు వచ్చిన బెదిరింపుల తర్వాత, ఇప్పుడు అమీర్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకోవడం బాలీవుడ్‌లో కలకలం రేపింది.
Also Read : బోల్డ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలో అడుగుపెట్టిన మిల్కీ బ్యూటీ
ఈ గ్యాంగ్ చేసిన ఆరోపణల ప్రకారం, అమీర్ ఖాన్ తో పాటుగా మరికొంత మంది సెలబ్రిటీలు దేశంలో లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తున్నారని, ఇది తమ సంస్కృతిపై దాడి అని వారు పేర్కొన్నారు. ఇటువంటి పనులు చేస్తే సహించేది లేదని, వారి శ్వాస ఆపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఎఫ్బీఐ చేపట్టిన ఆపరేషన్ హార్డ్‌బాల్ దర్యాప్తు తమను ఏమీ చేయలేదని, తాము మళ్ళీ యథావిధిగా పని మొదలుపెట్టామని ఈ పోస్ట్ ద్వారా గ్యాంగ్ సంకేతాలు పంపినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
అంతేకాకుండా, రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్‌లో ఒక యువతిపై జరిగిన అఘాయిత్య ఘటనను కూడా ఈ పోస్ట్‌లో ప్రస్తావించారు. ఈ కేసులో నిందితులను కాపాడుతున్న రాజకీయ నాయకులకు గ్యాంగ్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. వారు తమ జోక్యాన్ని తక్షణమే ఆపకపోతే, నిందితులకు ఇచ్చే శిక్షనే వారికీ తప్పదని బెదిరించారు. ఈ పోస్ట్ చివరలో మరణించిన తమ సహచరులు పర్వేష్, హిమాన్షులను అమరవీరులుగా అభివర్ణిస్తూ, వారి త్యాగం వృథా కాదని, తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామని గ్యాంగ్ ప్రతిజ్ఞ చేసింది.
Also Read : చిత్తూరులో సమంత సీమంతం! ఫొటోలు చూశారా?









