అల్లు అర్జున్ ‘పుష్ప 2’ చిత్రం మరోసారి సత్తా చాటింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో రెండు అవార్డులను కైవసం చేసుకుంది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ విభాగాల్లో అవార్డుకు  ఎంపికైంది. బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ గా దీపాలీ నూర్, శీతల్ శర్మ,   స్క్రీన్ ప్లే రైటర్ గా సుకుమార్ అవార్డు దక్కించుకున్నారు.

Also Read : నిహారిక సినిమాకు నేషనల్ అవార్డు.. విజేతల లిస్ట్ ఇదే

Also Read : ప్రభాస్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి! వీడియో వైరల్

అల్లు అర్జున్ కు షాక్

అయితే కొద్ది రోజులుగా పుష్ప 2 చిత్రంలో అల్లు అర్జున్ నటనకు మరోసారి నేషనల్ అవార్డు పక్కా అంటూ ఫ్యాన్స్  సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు. కానీ, బన్నీ అభిమానులకు నిరాశే మిగిలింది. కేవలం బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్, బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ విభాగాల్లో మాత్రమే ‘పుష్ప 2’ చిత్రానికి అవార్డులు వరించాయి. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి, కార్తీక ఆర్యన్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు.

అలాగే ‘అమరన్’ సినిమాకు గానూ జీవీ ప్రకాశ్ కుమార్‌కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు దక్కింది. ‘లక్కీ భాస్కర్’ మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లే (డైలాగ్స్) విభాగంలో పురష్కారం లభించింది.