
ఆర్యన్ రాజేష్ ‘సొంతం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన నటి నమిత.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే సినిమాలు మానేసిన తర్వాత బొద్దుగా కనిపించిన నమిత.. తన తాజా లుక్ తో అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. సన్నగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. తాను పూర్తిగా సన్నబడ్డానని అందరికీ తెలిసేలా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది చూసి అభిమానులంతా షాకవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. నమిత మళ్ళీ సినిమాల్లోకి వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సలహాలు ఇస్తున్నారు.
గుర్తుపట్టలేనంతగా మారిన నటి నమిత pic.twitter.com/FIKYHHxu3A
— RTV (@RTVnewsnetwork) July 17, 2026
Also Read : నా తండ్రి బతిమిలాడితే చూశాను .. భాగ్యశ్రీ ఎమోషనల్!
తెలుగులో ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అందం అభినయంతో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమాలో గ్లామరస్ ఖ్వీన్ గా కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. 2010 తర్వాత తెలుగు తెరపై కనిపించకుండా పోయింది. ఇదే సమయంలో అటు తమిళ్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపొయింది. చిన్న హీరోల నుంచి వరకు అందరితో కలిసి నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ సంపాదించుకుంది. తమిళ్లో ఆయి, ఇంగ్లీషుకారన్, బంబర కన్నలే, ఆనై, అళగియ తమిళ మగన్ వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో నాయకుడు, సింహా, జెమిని, ఒకరాజు ఒక రాణి తదితర సినిమాల్లో మెరిసింది. 2017లో వీరేంద్రను పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వీరికి ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Also Read : హీరో ఆర్యకు బిగ్ షాక్.. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు!









