స్టార్ హీరోయిన్ సమంత ఇటీవలే తన ప్రెగ్నెన్సీ రివీల్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఆమెకు  సీమంతం వేడుక జరిగినట్లు సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవలే భర్తతో కలిసి థాయిలాండ్ వెకేషన్ పూర్తి చేసుకున్న సామ్.. ఆ తర్వాత ఓ ఫంక్షన్ కోసం చిత్తూరులోని అత్తారింటికి వెళ్లారట. ఈ సందర్భంగా అక్కడ ఆమెకు రాజ్ కుటుంబ సభ్యులు సింపుల్ గా సీమంతం వేడుక నిర్వహించారట. అయితే దీనిపై సామ్ లేదా రాజ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి ఈ ఫొటోలు నిజమా? లేదా ఏఐ జనరేటడ్ పిక్సా అనేది తెలియాల్సి ఉంది.

Also Read : ప్రభాస్ హీరోయిన్ ఇలా మారిపోయిందేంటి! వీడియో వైరల్

‘ఖుషీ’ సినిమా తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న సామ్ ఇటీవలే ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టింది. ఎలాంటి టికెట్ ధరల పెంపు లేకుండా రూ. 100 కోట్ల కలెక్షన్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. కథానాయిక ప్రాధాన్యమున్న సినిమా 100 కోట్లు సాధించడం ఇదే తొలిసారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రంలో సమంత యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, శ్రీముఖి, వెన్నెల కిషోర్, గౌతమి, శ్రీ లక్ష్మి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ‘ఓ బేబీ’ తర్వాత సామ్- నందు రెడ్డి కాంబోలో ఇది రెండో సూపర్ హిట్ సినిమాగా నిలిచింది.

థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న అనంతరం జులై 17 నుంచి ‘మా ఇంటి బంగారం’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. జియో హాట్ స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ సినిమా తర్వాత సామ్ లైనప్ లో మరో వెబ్ సీరీస్ ఉంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రక్త బ్రహ్మాండం: ది బ్లడీ కింగ్‌డమ్ సీరీస్ చేస్తోంది. ఫాంటసీ యాక్షన్-డ్రామాగా రూపొందుతున్న ఈ సీరీస్ లో ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ మరియు వామికా గబ్బిల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : అమీర్ ఖాన్ కు బిగ్‌ షాక్‌… మూడో పెళ్లి చెల్లదంటూ ఫత్వాజారీ