
మిల్కీ బ్యూటీ తమన్నా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కు సంబంధించి క్రేజీ అప్డేట్ పంచుకున్నారు. హిందీలో భారీ విజయాన్ని సాధించిన హారర్ థ్రిల్లర్ ‘రాగిణి’ ఫ్రాంచైజీలో భాగమయ్యారు. ‘రాగిణి’ 3 లో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తమన్నా ‘రాగిణి 3’ క్లాప్‌బోర్డ్ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పటికే రెండు భాగాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు 3 పార్ట్ తో ప్రేక్షకులను అలరించనుంది. తమన్నా ఎంట్రీ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
Ragini 3 starring Tamannaah Bhatia officially goes on floors 🎬
Directed by Shashanka Ghosh pic.twitter.com/EFW1TlzCLI— Best Of Cinema (@R0npz) July 16, 2026
ఏక్తా కపూర్ బాలాజీ మోషన్ పిక్చర్స్ నిర్మాణంలో శశాంక ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తమన్న సరసన జునైద్ ఖాన్ నటిస్తున్నారు. నర్గీస్ ఫఖ్రీ, ఆయుష్ శర్మ, శరణ్ లాలీ స్థితి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జులై మొదటి వారంలో లండన్ లో ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. మేకర్స్ 2027 లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ‘రాగిణి’ పార్ట్ 1 లో రాజ్‌కుమార్ రావ్, కైనాజ్ మోటివలా జంటగా నటించారు. ‘రాగిణి 2’ లో సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు మిల్కీ బ్యూటీ తెరపైకి రావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.









