Subhash

Nand Kishore Goenka : ఎస్సెల్ గ్రూప్ అధినేత డాక్టర్ సుభాష్ చంద్ర తన తండ్రి, ప్రముఖ సామాజిక కార్యకర్త అయిన స్వర్గీయ నంద్ కిషోర్ గోయెంకా జ్ఞాపకార్థం గొప్ప విద్యా సంస్థను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఆశయాలు ఎప్పటికీ నిలిచిపోయేలా దాదాపు 100 కోట్ల రూపాయల భారీ ఖర్చుతో, 32 ఎకరాల స్థలంలో శ్రీ నంద్ కిషోర్ గోయెంకా విశ్వవిద్యాలయం పేరుతో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తన తండ్రి అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆయన ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు.

Also Read : తెలంగాణలో ‘సర్‌’ (SIR) గడువు పొడిగింపు: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఈ యూనివర్సిటీలో ఆర్థికంగా వెనుకబడిన, నిరుపేద విద్యార్థులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. డబ్బు లేక చదువుకు దూరమయ్యే పరిస్థితి రాకుండా వారికి అండగా నిలవనున్నారు. అంతేకాకుండా, నంద్ కిషోర్ గోయెంకా సేవా దృక్పథాన్ని రాబోయే తరాలకు అందించే ఉద్దేశ్యంతో, ఈ యూనివర్సిటీలో సామాజిక సేవ, దాతృత్వం అనే ఒక ప్రత్యేక కోర్సును కూడా తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది నుంచే ఇక్కడ క్లాసులు మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

నంద్ కిషోర్ గోయెంకా ఒక పెద్ద వ్యాపార కుటుంబంలో పుట్టినప్పటికీ, వ్యాపారాలకు దూరంగా ఉంటూ జీవితాంతం సమాజ సేవకే అంకితమయ్యారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో కూడా ఆయన ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ఎంతో కాలం పాటు సేవలు అందించారు. ఆయన నమ్మిన మానవీయ విలువలు, ఆశయాలకు తగ్గట్టుగానే ఈ యూనివర్సిటీని తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్నదే ఈ సంస్థ ఏర్పాటు వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశమని ఎస్‌సెల్ గ్రూప్ తెలిపింది.

Also Read : మరో అవినీతి అనకొండ పట్టివేత..హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్‌కు వందల కోట్ల అక్రమ ఆస్తులు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.