
Vikram-1: భారత అంతరిక్ష చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రముఖ స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్-1 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధవణ్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ రాకెట్‌ను శాస్త్రవేత్తలు ప్రయోగించారు. దేశీయ ప్రైవేట్ రంగంలో అంతరిక్ష ప్రయోగాలు ఊపందుకుంటున్న తరుణంలో ఈ సక్సెస్ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : పెరుగుతున్న కరోనా కేసులు: మళ్లీ మాస్క్ ధరించాల్సిందేనా? డాక్లర్లు ఏం అంటున్నారంటే?
నిజానికి ఈ రాకెట్ ప్రయోగం ముందుగా నిర్ణయించిన సమయం కంటే అరగంట ఆలస్యంగా జరిగింది. సాంకేతిక కారణాల వల్ల ప్రయోగ ప్రక్రియలో స్వల్ప జాప్యం జరిగినప్పటికీ, శాస్త్రవేత్తలు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి ప్రయోగాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు. గగనతలం వైపు రాకెట్ దూసుకెళ్తున్న దృశ్యాలను చూసి అంతరిక్ష కేంద్రంలోని సిబ్బంది, స్కైరూట్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ రాకెట్ ప్రయోగం ద్వారా భారత ప్రైవేట్ అంతరిక్ష పరిశ్రమ ప్రపంచ స్థాయికి చేరుకుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అల్ప ఖర్చుతో, అత్యాధునిక సాంకేతికతతో రాకెట్లను తయారు చేయగలమని స్కైరూట్ ఏరోస్పేస్ ఇప్పటికే నిరూపించింది. ఈ ‘విక్రమ్-1’ విజయం భవిష్యత్తులో మరిన్ని ప్రైవేట్ అంతరిక్ష ప్రయోగాలకు బాటలు వేయనుంది.
Also Read : విజయ్ ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర… TVK MLAలకు రూ. 35 కోట్ల ఆశ!









