corona death

Coronavirus :  ఏపీలో కరోనా వైరస్ మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. జూన్ 26 నుంచి జూలై 16 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దురదృష్టవశాత్తూ, వీరిలో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్న నలుగురు వ్యక్తులు మరణించారు. మరణించిన వారిలో ముగ్గురు కడప జిల్లాకు చెందినవారు కాగా, మరొకరు కాకినాడకు చెందినవారు. వీరంతా రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా అధికారులు వెల్లడించారు.

Also Read : మల్లప్ప కొండలో మిస్టరీ హత్య: భర్త దారుణ హత్య.. భార్య, చిన్నారి అదృశ్యం

అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జూన్ 26న కడప జిల్లాలో మొదటి కేసు నమోదైంది. అప్పటి నుంచి జూలై 16 వరకు మొత్తం 12 కేసులు వెలుగుచూశాయి. జిల్లాల వారీగా చూస్తే కడపలో అత్యధికంగా 8 కేసులు, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒకటి చొప్పున నమోదయ్యాయి. ఈ కేసులు ఒకే చోట కాకుండా వేర్వేరు మండలాల్లో నమోదయ్యాయి. జూన్ 26 నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో మొత్తం 67 పరీక్షలు నిర్వహించగా, 11 మందికి పాజిటివ్ వచ్చింది. 12వ కేసు వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం పాజిటివ్‌గా తేలిన వారిలో ముగ్గురు హోమ్ ఐసోలేషన్‌లో ఉండగా, ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ముగ్గురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి ఇప్పటివరకు 339 కేసులు నమోదయ్యాయి. ఇందులో కేరళ (115) అగ్రస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో కర్ణాటక (64), మహారాష్ట్ర (43), తమిళనాడు (39), అండమాన్ నికోబార్ దీవులు, ఢిల్లీ (18 చొప్పున) ఉన్నాయి. ప్రజలు భయాందోళన చెందకుండా, తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

Also Read : ‘పీఓకే స్వతంత్ర ప్రాంతం కాదు, ఆక్రమిత భూభాగం’ – కాశ్మీరుల గర్జన

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.