
Kerala Accident : కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద జరిగింది. ఈ ఘటనలో ఎనిమిది మంది తమిళనాడు విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిసూర్ జిల్లాలోని కైపమంగళం వద్ద శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాత్రి 11.40 గంటల సమయంలో తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్న కారు గురువాయూర్ వైపు నుంచి కొడుంగల్లూర్ వైపు వెళ్తోంది. జాతీయ రహదారి-66పై కారు వేగంగా వెళ్తుండగా.. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో డైవర్షన్ వద్ద రోడ్డుపై నిలిపి ఉంచిన లారీని బలంగా ఢీకొట్టింది.
Also Read : 100 అడుగుల లోయలోకి ముగ్గురు పిల్లలతో మహిళా రెజ్లర్.. ఇద్దరు పిల్లలతో సహా మృతి
ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో.. దాదాపు ఖాళీగా ఉన్న రహదారిపై కారు వేగంగా దూసుకెళ్తున్నట్లు కనిపించింది. ఆ తర్వాత లారీని ఢీకొట్టడంతో ఒక్కసారిగా దుమ్ము పైకి లేచినట్లు దృశ్యాల్లో నమోదైంది. అయితే లారీ సీసీటీవీ కెమెరాకు కనిపించలేదు. మృతులు తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన పీఎస్ఎం ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులుగా ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. కారులో ఉన్న మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం తీవ్రతతో కారు పూర్తిగా నుజ్జునుజ్జయిపోయింది. దీంతో మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టంగా మారింది. కారును కత్తిరించి ఒక్కొక్కరిని బయటకు తీశారు. స్థానికులతో పాటు పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను త్రిసూర్ మెడికల్ కాలేజీ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Also Read : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్‌సాయి.. ఎందుకంటే?









