
Eshwar Sai vs Madhuri Rathod : ఇటీవల ఫోక్ ఇండస్ర్టీలో సంచలనం సృష్టించిన ఈశ్వర్‌సాయి, మాధురి రాథోడ్ అంశం లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనపై మాధురి రాథోడ్ కేసు పెట్టడం ప్రస్తుతం సంచలనంగా మారింది. దీంతో ఈశ్వర్‌సాయి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈశ్వర్ సాయిపై BNS 69 కింద నార్సింగి పీఎస్‌లో కేసు నమోదు కావడంతో ఈశ్వర్ సాయి హై కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశాడు. కాగా, గత కొన్నిరోజుల క్రితం ఈశ్వర్ సాయి – మాధురి రాథోడ్ ఒకే రూమ్ లో ఏకంతంగా ఉండడంతో ఈశ్వర్ సాయి భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మాధురిపై చేయి చేసుకున్న విషయం తెలిసిందే.
కాగా, ఈ రోజు మాధురి రాథోర్ ఈశ్వర్‌సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. తనను శారీరకంగా వాడుకొని మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత మోసం చేశాడని మాధురి తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈశ్వర్ సాయి పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఆయన కోసం రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read : కేసీఆర్ కోసం వెయ్యి రోజుల్లో రూ.21 కోట్ల ఖర్చు..పదవీకి రాజీనామా చేయ్..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మాధురి రాథోడ్ చేసిన ఫిర్యాదు ప్రకారం.. ఈశ్వర్ సాయి తనను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి తనతో సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపించింది. అయితే ఆ తర్వాత తనను మోసం చేశాడని తెలిపింది. ఆమె ఫిర్యాదుతో పోలీసులు ఈశ్వర్ సాయిపై BNS సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో తన పరువుకు భంగం కలిగించేలా ఈశ్వర్ సాయి వ్యవహరించాడని కూడా మాధురి ఆరోపించింది. తన ఫోన్లో ఉన్న వీడియోలను ఉపయోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా మార్ఫింగ్ వీడియోలు తయారు చేశాడని, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేశారని ఫిర్యాదులో ఆరోపించింది. తనకు అక్రమ సంబంధాలు ఉన్నట్లు చూపించేలా ఏఐ వీడియోలు సృష్టించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మాధురి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడంతో ఈశ్వర్ సాయి హైకోర్టును ఆశ్రయించాడు.
కాగా, ఇటీవల ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కలిసి ఓ హోటల్ రూమ్‌లో ఉన్న సమయంలో ఆయన భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆ సమయంలో తన తప్పేమీ లేదంటూ ఈశ్వర్ సాయి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించిన విషయం కూడా తెలిసిందే. అది అలా ఉండగానే తాజాగా మాధూరి రాథోడ్ ఫిర్యాదుతో ఈ వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Also Read : తుక్కుగూడ నర్సు హత్యకేసు… రాడ్‌తో ముఖంపై బాది అత్యాచారం..









