
TG News : తెలంగాణ సచివాలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సచివాలయ ఉద్యోగి రాజు ఆకస్మిక మృతి చెందారు. తెలంగాణ సచివాలయంలో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్ వ్యక్తిగత కార్యదర్శి (PS)గా విధులు నిర్వహిస్తున్న రాజు ఆకస్మికంగా మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం విధులకు హాజరైన రాజు, ఆవరణలో ఉన్న సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై కింద కుప్పకూలిపోయారు. అదే సమయంలో అక్కడే ఉన్న మంత్రి వాకిటి శ్రీహరి తక్షణమే స్పందించారు. రాజు పడిపోవడాన్ని గమనించిన శ్రీహరి ఆయనకు సీపీఆర్ చేసి, ప్రాథమిక చికిత్స అందించారు.
Also Read : కేసీఆర్ ఇంటి వద్ద హైటెన్షన్.. కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల రాళ్ల దాడి!
అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఆయన ఆస్పత్రికి చేరుకునే లోపే పల్స్ పడిపోవడంతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా రాజు అకాల మరణం పట్ల సచివాలయ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మరణం పై పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Also Read : గుర్తుంచుకో…మహిళల కన్నీళ్లు నిన్ను వెంటాడుతాయి…రేవంత్ పై కేటీఆర్ ఫైర్









