
UK : భారత్-బ్రిటన్ వాణిజ్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ను బ్రిటన్ తన కార్బన్ బార్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం కింద గుర్తించింది. దీంతో బ్రిటన్‌కు భారత ఉత్పత్తులను ఎగుమతి చేసే కంపెనీలకు కొంత ఊరట లభించనుంది.
సాధారణంగా చెప్పాలంటే.. ఒక వస్తువును తయారు చేసే సమయంలో ఎంత కార్బన్ కాలుష్యం వచ్చిందో దానికి అనుగుణంగా పన్ను విధిస్తారు. అయితే ఆ వస్తువుపై భారత్‌లోనే ఇప్పటికే కార్బన్ ధర చెల్లించి ఉంటే.. బ్రిటన్‌లో మళ్లీ అదే మొత్తానికి పన్ను పడకుండా చూసుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. అయితే ఇందుకు సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది.
Also Read : అప్పులు తీర్చలేక .. అమ్మాకానికి మొజ్తాబా ఖమేనీ ఇల్లు : ఎన్ని కోట్లంటే?
ఈ నిర్ణయం భారత్ వాణిజ్య మంత్రిత్వ శాఖ, బ్రిటన్ అధికారుల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చల తర్వాత వచ్చింది. ఇప్పటికే యూకే.. యూరోపియన్ యూనియన్ ఎమిషన్స్ ట్రేడింగ్ సిస్టమ్‌తో పాటు 16 కార్బన్ ధరల విధానాలను గుర్తిస్తోంది. ఇప్పుడు భారత్ సీసీటీఎస్ కూడా ఆ జాబితాలో చేరింది.
నిజానికి.. గత మేలో భారత్-బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చినప్పుడు, సీబీఏఎం నుంచి భారత్‌కు పూర్తి మినహాయింపు ఇవ్వాలని కోరింది. కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు. 2027 జనవరి నుంచి ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై బ్రిటన్ కార్బన్ పన్ను విధించే అవకాశం ఉండటంతో భారత ఎగుమతిదారులపై అదనపు భారం పడుతుందనే ఆందోళన ఉంది.
ఇప్పుడు సీసీటీఎస్‌కు బ్రిటన్ గుర్తింపు ఇవ్వడంతో ఆ భారం కొంత తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది పూర్తి పన్ను మినహాయింపు మాత్రం కాదు. కార్బన్ ధరను భారత్‌లో ఇప్పటికే చెల్లించినట్లు కంపెనీలు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది.
Also Read : విమానం గాల్లో ఉండగా ఇంజిన్ లో తగ్గిన ఆయిల్ తగ్గింది.. ఎమర్జెన్సీ ల్యాండ్!









