ఆర్టీసీ బస్సుల్లో సాధారణంగా కనిపించే మహిళలను గౌరవించడం మన సంప్రదాయం అనే బోర్డు మనందరికీ తెలిసిందే. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కొత్త ఫొటో తెగ వైరల్ అవుతోంది. అందులో పురుషులను గౌరవించడం మన సంప్రదాయం.. వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని రాసి ఉంది. సూర్యాపేట రూటులో నడిచే బస్సులో ఈ బోర్డు పెట్టారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

Also Read : తండ్రి జ్ఞాపకార్థం రూ.100 కోట్లతో భారీ యూనివర్సిటీ: సుభాష్ చంద్ర కీలక నిర్ణయం!

మహిళలకు ఉచిత ప్రయాణ పథకాలు అమల్లోకి వచ్చిన తర్వాత, బస్సుల్లో సీట్ల కోసం గొడవలు జరుగుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో, పురుషుల పక్షాన ఎవరైనా ఇలా బోర్డు పెట్టారా అని నెటిజన్లు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. కొందరు దీన్ని సమర్థిస్తూ ఫన్నీగా కామెంట్లు పెడుతుంటే, మరికొందరు మాత్రం ఇది ఎవరో కావాలని చేసిన మార్ఫింగ్ అని కొట్టిపారేస్తున్నారు. అసలు పాత బోర్డు మీద ఉన్న స్త్రీలను అనే పదాన్ని తీసేసి, ఇలా ఎడిటింగ్ చేశారని చాలామంది వాదిస్తున్నారు.

ఈ వైరల్ ఫొటోపై ఆర్టీసీ అధికారులు స్పందించారు. ప్రభుత్వ బస్సుల్లో ఉండే బోర్డులను కావాలని మార్చడం లేదా స్టిక్కర్లను మార్చి తప్పుడు ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. ఇలాంటి పనులు చేసే వారిపై ఐటీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మొత్తానికి, ఆ బస్సులో నిజంగానే బోర్డు పెట్టారా? లేక ఎవరైనా నెటిజన్ల కంటికి చిక్కడానికి ఇలా ఎడిటింగ్ చేశారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అప్పటివరకు సోషల్ మీడియాలో ఈ చర్చ మాత్రం కొనసాగుతూనే ఉంది.

Also Read : తెలంగాణలో పోక్సో చట్టం పటిష్ఠ అమలు: సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.