fifa

FIFA World Cup 2026 :  అమెరికా వేదికగా జరిగిన ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ పోరులో స్పెయిన్ జట్టు విజేతగా నిలిచింది. న్యూయార్క్ న్యూ జెర్సీ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అర్జెంటీనాపై 1-0 తేడాతో స్పెయిన్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ 106వ నిమిషంలో ఫెర్రాన్ టోర్రెస్ కొట్టిన గోల్ స్పెయిన్‌కు రెండోసారి ప్రపంచ కప్‌ను అందించింది. అర్జెంటీనా ఆటగాడు ఎంజో ఫెర్నాండెజ్ రెడ్ కార్డ్ కారణంగా మైదానం వీడటంతో, ఆ జట్టు పది మందితోనే ఆడాల్సి వచ్చింది. ఈ ఓటమితో మెస్సీ తన చివరి వరల్డ్ కప్‌ను చేజార్చుకుని కన్నీటిపర్యంతమయ్యాడు. టోర్నీ ఆద్యంతం అద్భుతమైన రక్షణ శ్రేణితో ఆడిన స్పెయిన్, ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం ఒక గోల్ మాత్రమే ఇచ్చి రికార్డు సృష్టించింది.

Also Read : దుబాయ్ లో వైభవం.. అంగరంగ వైభవంగా బోనాల పండుగ!

ఈ టోర్నమెంట్ కోసం ఫిఫా మొత్తం 727 మిలియన్ డాలర్లు ప్రకటించగా, అందులో 655 మిలియన్ డాలర్లను బహుమతి రూపంలో 48 జట్లకు పంచారు.

విజేత (స్పెయిన్): 50 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.481 కోట్లు)

రన్నరప్ (అర్జెంటీనా): 33 మిలియన్ డాలర్లు

3వ స్థానం (ఇంగ్లాండ్): 29 మిలియన్ డాలర్లు

4వ స్థానం (ఫ్రాన్స్): 27 మిలియన్ డాలర్లు

5-8 స్థానాలు: 19 మిలియన్ డాలర్లు

9-16 స్థానాలు: 15 మిలియన్ డాలర్లు

17-32 స్థానాలు: 11 మిలియన్ డాలర్లు

33-48 స్థానాలు: 9 మిలియన్ డాలర్లు

Also Read : పి.వి సింధూ విజయంపై సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రశంసల వర్షం..

వ్యక్తిగత పురస్కారాలు (అవార్డులు):

సిల్వర్ బాల్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)

బ్రాంజ్ బాల్: కైలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)

గోల్డెన్ బూట్: కైలియన్ ఎంబాప్పే (ఫ్రాన్స్)

సిల్వర్ బూట్: లియోనెల్ మెస్సీ (అర్జెంటీనా)

బ్రాంజ్ బూట్: జూడ్ బెల్లింగ్‌హామ్ (ఇంగ్లాండ్)

గోల్డెన్ గ్లోవ్: ఉనై సైమన్ (స్పెయిన్)

ఫిఫా యంగ్ ప్లేయర్ అవార్డు: పావ్ క్యుబార్సీ (స్పెయిన్)

ఫిఫా ఫెయిర్ ప్లే ట్రోఫీ: నెదర్లాండ్స్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.