
BIG BREAKING : పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గురువారం జరిగిన రథయాత్ర సందర్భంగా పూరీలోని గ్రాండ్ రోడ్ వద్ద భారీగా భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. ఈ రద్దీ కారణంగా సుమారు 120 మంది భక్తులు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగి, వారందరినీ రక్షించి చికిత్స కోసం పూరీ మెడికల్ ఆసుపత్రికి తరలించాయి.
Also Read : మమతకు మరో షాక్.. నటి రాజీనామా!
VIDEO | Puri, Odisha: A person, who appeared to have fainted, taken for medical treatment as huge number of people gather to attend the annual Jagannath Rath Yatra.
Heavy security arrangements have been put in place to manage the surge in footfall and ensure the smooth conduct… pic.twitter.com/jhf32hhPKo
— Press Trust of India (@PTI_News) July 16, 2026
ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించినట్లు సమాచారం అందుతోంది. ఊపిరి ఆడక స్పృహ తప్పి పడిపోయిన ఆ వ్యక్తిని వెంటనే పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మరణించాడని వైద్యులు ధృవీకరించారు. అయితే, దీనిపై అధికారుల నుంచి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రత్యేక రెస్క్యూ యూనిట్ వెంటనే స్పందించి, రద్దీగా ఉన్న ప్రాంతం నుండి భక్తులను సురక్షితంగా బయటకు పంపించింది. మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు గ్రాండ్ రోడ్ వెంబడి రద్దీ నియంత్రణ చర్యలను మరింత కఠినతరం చేశారు.
ప్రపంచ ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర పూరీలో ఎంతో వైభవంగా ప్రారంభమైంది. 12వ శతాబ్దపు ఆలయం నుండి గుండిచా ఆలయం వరకు జరిగే ఈ వార్షిక యాత్రను చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. డప్పుల మోతలు, శంఖారావాలు, కంచు తాళాల ధ్వనుల మధ్య ఉత్సాహంగా యాత్ర మొదలైంది. మొదటగా చక్రరాజ సుదర్శనుడిని ప్రధాన ఆలయం నుండి తీసుకువచ్చి దేవీ సుభద్ర రథమైన దర్పదలనపై ప్రతిష్టించారు.
Also Read : స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ వినూత్న ప్రయోగం: ఇకపై 10 నిమిషాల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్!









