Koel Mallick : తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాజ్యసభ సభ్యురాలు రుక్మిణి మల్లిక్ తన పదవికి రాజీనామా చేశారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయినప్పటి నుండి ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తున్న విషయం తెలిసిందే.

రుక్మిణి మల్లిక్ నేరుగా రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. “నేను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను, దీనిని వెంటనే ఆమోదించవలసిందిగా కోరుతున్నాను” అని ఆమె తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. తన పదవీకాలంలో సహకరించిన డిప్యూటీ ఛైర్మన్‌కు, రాజ్యసభ సెక్రటేరియట్ అధికారులందరికీ ఆమె తన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. 120 మందికి గాయాలు!

రుక్మిణి మల్లిక్‌ కంటే ముందుగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు సుఖేందు శేఖర్ రాయ్, సుస్మితా దేవ్ , ప్రకాష్ చిక్ బరైక్ కూడా రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వరుసగా ఎంపీలు పార్టీని వీడుతుండటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మమత పార్టీని వీడిన నాయకుల్లో చాలామంది ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. అంతకుముందు టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు పార్టీని వీడి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మిత్రపక్షమైన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియాలో విలీనమయ్యారు.

Also Read : 120 మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు రిజైన్.. ఏం జరుగుతోంది?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.