Parliament : ఉభయసభల్లో కీలక బిల్లు సవరణకు మోదీ సర్కార్ ఆమోదం లభించింది.
ఢిల్లీలో జరిగిన విద్యార్థుల ఆందోళనలపై పోలీసు చర్యకు బదులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నిరసన తెలిపారు. అయితే అంతకుముందు, ఎలాంటి పెద్ద చర్చ లేకుండానే శుక్రవారం లోక్‌సభ కూడా ఈ బిల్లును ఆమోదం లభించింది. ప్రస్తుత చట్టంలోని సెక్షన్ 13లోని సబ్-సెక్షన్ (3)ని సవరించారు. ఒకవేళ ఆలస్యంగా నమోదు చేసుకునే నిబంధనలను మరింత టైట్ చేయాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది.

జననాలు, మరణాలను నిర్ణీత సమయంలోనే నమోదు చేయడాన్ని ప్రోత్సహించడమే ఈ సవరణ ముఖ్య ఉద్దేశమని అమిత్ షా తన ప్రకటనలో తెలిపారు. ఒకవేళ ఎవరైనా పుట్టిన లేదా చనిపోయిన విషయాన్ని ఏడాది లోపు చెప్పకుండా లేట్‌గా చెప్తే ఎలా ఉంటుందో ఈ బిల్లులో స్పష్టంగా వివరించారు. ఒక సంవత్సరం దాటిపోయి, రెండు సంవత్సరాల లోపు గనుక ఆ వివరాలు అధికారులకు చెప్తే.. ఆ పుట్టుకను గానీ, మరణాన్ని గానీ నేరుగా నమోదు చేయడానికి కుదరదన్నమాట. ఇలాంటి సమయంలో జిల్లా కలెక్టర్/మేజిస్ట్రేట్ లేదా ఆయన కింద ఉండే సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్, లేదంటే వాళ్లు ఎవరికైతే పర్మిషన్ ఇస్తారో ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ నుంచి ప్రత్యేకంగా ఉత్తర్వులు తెస్తేనే రిజిస్టర్ చేస్తారు.

Also Read : డెలివరీ బాయ్ దారుణం : ఫుల్ గా తాగి.. ఒంటరిగా ఉందని యువతి ఇంట్లోకి దూరబోయి!

ఒకవేళ రెండు సంవత్సరాలు కూడా దాటిపోయిన తర్వాత చాలా ఆలస్యంగా చెప్తే మాత్రం రూల్స్ మరింత కఠినంగా ఉంటాయి. పుట్టుక లేదా మరణం నిజంగానే జరిగిందా లేదా అని పూర్తిగా పరిశీలించి, సరిచూసుకున్న తర్వాత.. మొదటి శ్రేణి కోర్టు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ప్రత్యేకంగా ఆర్డర్ ఇస్తేనే ఆ వివరాలను రికార్డుల్లో నమోదు చేస్తారు. అంటే, కాలం గడిచిపోయిన కొద్దీ ఆ వివరాలను నమోదు చేయించుకోవడం మరింత కష్టమవుతుంది.

ఈ బిల్లుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో మాట్లాడుతూ.. దేశంలో పుట్టే ప్రతి బిడ్డ వివరాలు రిజిస్టర్ కావాలి, ప్రతి మరణం అధికారికంగా రికార్డు కావాలన్నదే మోదీ సర్కార్ సంకల్పానికి ఈ బిల్లు రూపమన్నారు. దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి జననం నమోదు కావడం చాలా ముఖ్యమని, అలాగే చనిపోయిన వారు కొందరికి లబ్ధి చేకూర్చేలా ఓటర్ల జాబితాలో అలాగే కొనసాగించడానికి వీల్లేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 2014లో దేశంలో రిజిస్టరైన జననాలు కేవలం 86.6 శాతంగా ఉండేవి, కానీ 2024 నాటికి అది 99.1 శాతానికి పెరిగాయని చెప్పారు. ఇక మరణాల విషయానికి వస్తే, 2014లో 72.5 శాతం మరణాలు మాత్రమే రిజిస్టర్ కాగా, ఇప్పుడు అది 99.4 శాతానికి చేరిందని ఆయన చెప్పుకొచ్చారు. జననాలు, మరణాల రిజిస్ట్రేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని మోసం చేసిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

ఇక పార్లమెంట్ ఉభయ సభలు ఈ బిల్లును ఆమోదం లభించడంతో వెంటనే రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు. రాష్ట్రపతి ఆమోద ముద్రతో ఇది అధికారికంగా చట్టంగా మారుతుంది. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం గెజిట్ ద్వారా దీనిని దేశవ్యాప్తంగా అమలులోకి తీసుకువస్తుంది.

Also Read : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పన్నీర్‌ బ్యాన్.. అమ్మితే లక్ష రూపాయలు ఫైన్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.