
Bengaluru : బెంగళూరులో మహిళల భద్రతపై చర్చ మళ్లీ మొదలైంది. డెలవరీ బాయ్ రూపంలో ఓ యువతికి ఎదురైన దారుణ అనుభవం సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది. పార్శిల్ డెలివరీ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ మద్యం సేవించి ఉన్నాడని, పార్శిల్ ఇచ్చిన తర్వాత తన ఇంట్లోకి రావడానికి ప్రయత్నించాడని ఆమె ఓ వీడియోలో చెప్పుకొచ్చింది. ఆ డెలివరీ బాయ్ బాల్కనీలో తన ఫోన్‌ను ఛార్జ్ చేసుకోవడానికి, సిగరెట్ కాల్చుకోవడానికి అనుమతి కోరడంతో మహిళల భద్రతపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకు ఏం జరిగిందంటే.. బెంగళూరులో ఒంటిరిగా ఉంటున్న అనేరి ఠక్కర్ అనే యువతి తన స్నేహితుడి జాకెట్‌ను తిరిగి ఇవ్వడానికి ఉబర్ పార్సెల్ సర్వీస్‌ను బుక్ చేసింది. అయితే ఆ యువతి ఇంటికి పార్సెల్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్ బాగా తాగి ఉన్నాడు. అతడు మద్యం తాగిన వాసన క్లియర్ గా వస్తోందని యువతి తన వీడియోలో చెప్పుకొచ్చింది.
Also Read : ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు!
A Bengaluru woman, Aneri Thakkar, has shared a disturbing experience, alleging that an Uber Parcel driver repeatedly tried to gain entry into her home, leaving her feeling unsafe.
Her Instagram video detailing the incident has garnered over 2.3 million views, sparking widespread… pic.twitter.com/K5c7e0RZYM
— Orissa POST Live (@OrissaPOSTLive) August 5, 2026
అయితే డెలివరీ బాయ్ పార్సెల్ ఇచ్చిన తర్వాత అక్కడినుంచి వెళ్లిపోకుండా తన ఫోన్ బ్యాటరీ అయిపోయిందని చెప్పి ఇంటి లోపలికి వచ్చి కాసేపు ఛార్జ్ పెట్టుకుంటానని రిక్వెస్ట్ చేశాడు. ఇది చాలదు అన్నట్టుగా కొద్దిసేపు బాల్కనీలో సిగరెట్ తాగుతానని చెప్పాడు.
అయితే అతని ప్రవర్తన పట్ల అనుమానం వచ్చిన యువతి చాలా తెలివిగా ప్రవర్తించింది. నేరుగా వద్దని చెబితే తనపై ఏటాక్ చేస్తాడెమో భయపడి అని అతని ఫోన్ లో ఛార్జి్ంగ్ చేసింది. ఛార్జింగ్ 46 శాతంగా ఉండటంతో తనకు అబద్దం చెప్పి ఇంట్లోకి రావడానికి ప్రయత్నం చేసినట్లుగా యువతి గ్రహించింది. వెంటనే ఆ యువతి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ ఫోన్ చేసి పైకి రమ్మంది. సెక్యూరిటీ సిబ్బంది వచ్చినప్పటికీ, ఆ డెలివరీ బాయ్ యువతి వ్యక్తిగత ఫోన్ నంబర్ అడిగి పలుమార్లు వేధించాడు. చివరికి సెక్యూరిటీ సిబ్బంది జోక్యంతో ఆ యువతికి పెద్ద ప్రమాదం తప్పిందనే చెప్పాలి.
ఈ వ్యవహరం మొత్తాన్ని యువతి ఓ వీడియోలో వివరించడంతో మరోసారి మహిళల భద్రతపై ఆందోళన మొదలైంది. వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై ఉబర్ ఇండియా స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకున్నామని, బాధ్యుడైన డెలివరీ భాగస్వామిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. కాగా ఒంటరిగా ఉండే మహిళలు డెలివరీ బాయ్స్‌ను నేరుగా ఇళ్లలోకి రానివ్వకుండా, సెక్యూరిటీ గేట్ లేదా రిసెప్షన్ వద్దే పార్సెల్స్ తీసుకోవడం మంచిదని పోలీసులు చెబుతున్నారు.
Also Read : వీడియో కాల్లో తండ్రికి అంత్యక్రియులు.. ఇంకెక్కడి బంధాలు?









