
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ (OnePlus) తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్ OnePlus N6ను భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్‌లో అతి పెద్ద 8,000mAh బ్యాటరీ ఉంది. దీనికి ఒక్కసారి ఛార్జ్ చేస్తే మూడు రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16 వంటి ఫీచర్లు ఉన్నాయి.
OnePlus N6 ఫోన్ 4GB + 128GB వేరియంట్ ధర రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. అలాగే 6GB + 128GB వేరియంట్ ధర రూ.24,999గా ఉంది. OnePlus N6 స్మార్ట్‌ఫోన్ ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లలో లభిస్తుంది. దీని సేల్స్ జూలై 4న OnePlus.in, అమెజాన్ ఇండియాలో ప్రారంభం కానున్నాయి.
Also Read : ఇది కదా ఆఫరంటే: రూ.29వేలకే రూ.80వేల ఫోన్.. మిస్ అయితే మళ్లీ దొరకదు భయ్యా..!
OnePlus N6 ప్రారంభ ఆఫర్లలో భాగంగా ICICI బ్యాంక్‌తో సహా ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. ప్రైమ్ డే సేల్ సమయంలో అదనంగా రూ.1,000 తగ్గింపు పొందొచ్చు. ఈ డిస్కౌంట్ ఆఫర్లతో OnePlus N6ను మరింత తక్కువకే సొంతం చేసుకోవచ్చు.
OnePlus N6 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఇందులో 6.75-అంగుళాల HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16 పై పనిచేస్తుంది. కంపెనీ రెండు సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తోంది. OnePlus N6 ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్‌ను అమర్చారు. అలాగే ఇందులో 8,000mAh బ్యాటరీ ఉంది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్, 5W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఈ ఫోన్ 3 రోజుల వరకు పనిచేస్తుందని కంపెనీ పేర్కొంది.
OnePlus N6 ఫోన్‌లో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ AI ఎరేజర్, AI అన్‌బ్లర్, AI అల్ట్రా క్లారిటీ, గూగుల్ జెమిని, AI నోట్స్, డాక్యుమెంట్ స్కానింగ్ వంటి AI ఫీచర్లను కూడా అందిస్తుంది.
Also Read : తగ్గిన ముడిచమురు ధరలు… దిగిరాని పెట్రోల్, డీజిల్ ధరలు..ఎందుకో తెలుసా?









