Lindsey Graham Death :  అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు లిండ్సే గ్రాహం మరణం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీసింది. 71 ఏళ్ల వయసులో ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో, సోషల్ మీడియాలో రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రాహం మరణం వెనుక ఏదో కుట్ర ఉందని, ఆయనను చంపేశారని కొందరు ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది.

Also Read : బ్యాంకాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 27 మంది దుర్మరణం!

ఇంతకు ఏం జరిగిందంటే?

లిండ్సే గ్రాహం కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్నట్టు ఆయన కార్యాలయం తెలిపింది. వైద్య పరీక్షల్లో గుండెలోని ప్రధాన రక్తనాళం చిట్లడం వల్లే ఆయన చనిపోయారని ప్రాథమికంగా తేలింది. కానీ, ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు ఇది సహజ మరణం కాదని, ఆయన్ను విషం ఇచ్చి చంపారని ఆరోపిస్తున్నారు.

గ్రాహంకు గతంలోనే ఇరాన్ నుంచి బెదిరింపులు వచ్చాయి. అలాగే, ఆయన రష్యాకు వ్యతిరేకంగా, ఉక్రెయిన్‌కు మద్దతుగా గట్టిగా మాట్లాడేవారు. అందుకే ఇరాన్ లేదా రష్యాలే ఆయన్ను అంతం చేశాయని కొందరు ఆరోపిస్తున్నారు. కానీ, దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. మరోవైపు రష్యాకు చెందిన కొందరు అధికారులు, గ్రాహం మరణం వెనుక ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ హస్తం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ను ఇరాన్‌తో యుద్ధానికి పురిగొల్పడమే ఇజ్రాయెల్ లక్ష్యం కావచ్చని వారి వాదన.

అమెరికా విదేశాంగ విధానంలో లిండ్సే గ్రాహం చాలా పవర్‌ఫుల్ వ్యక్తి. ట్రంప్ అనుసరించిన విధానాల్లో కొన్నింటిని ఆయన సమర్థించారు, మరికొన్నింటిపై మౌనంగా ఉన్నారు. ముఖ్యంగా ఇరాన్ విషయంలో గ్రాహం చాలా కఠినంగా ఉండేవారు. ఆ దేశంపై దాడులు చేయాలని, వారి అణు కేంద్రాలను నాశనం చేయాలని గతంలోనే ఆయన బహిరంగంగా డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలన్నీ కేవలం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలే తప్ప, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఊహాగానాలు వ్యాప్తి చెందడం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Also Read : హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు: ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడులు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.