Road Accident : ఏపీలో ఏలూరు బస్సు ప్రమాదం మరిచిపోకముందే మరో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణం అడ్డరోడ్డు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు వేగంగా వెళ్లి ముందున్న ఆటోను బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న 15 మందిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.. మరో 8 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిలో నలుగురు చిన్నపిల్లలు ఉన్నారు. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వారిగా తెలుస్తోంది.

Also Read : కమలం గూటికి కొండా ఫ్యామిలీ.. స్వయంగా ఆహ్వానించిన అమిత్ షా?

మీతులంతా ఒకే గ్రామానికి చెందినవారే కాకుండా బంధువులుగా చెబుతున్నారు. వీరంతా బాపట్ల జిల్లా కొండమంజులూరులో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే నలుగురు మృతి చెందగా.. ఇద్దరు గుంటూరు జీజీహెచ్‌లో, ఒకరు చిలకలూరిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతులను బొంతా బాబు (62), బొంతా మణెమ్మ (55), (75), గంగమ్మ (50), చౌటుపల్లి సువార్త (45), సంపూర్ణమ్మ (70), లక్ష్మమ్మ మరియమ్మ(45) గా గుర్తించారు.

Also Read : త్వరగా యూఎస్‌ వచ్చేయండి.. అంతర్జాతీయ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీ పిలుపు

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.