Alla Nani :  ఏపీ రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీడీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు. వైజాగ్ లోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయస్సు 57 ఏళ్లు.. ఏలూరు నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాని. ఆయన అసలు పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. అనంతరంల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆళ్ల నాని 1969, డిసెంబరు 30న ఏలూరులో ఆళ్ల సూర్యచంద్రరావు, నాగమణి దంపతులకు జన్మించాడు. ఆయన ఏలూరులోని కెపి హై స్కూల్ లో 1985లో పదవతరగతి, 1988లో సర్ సిఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. నాని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బిఎ చదువుతూ మధ్యలోనే ఆపేసాడు.

ఆళ్ల నాని 1994, 1999లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2004లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అంబికా కృష్ణపై 33,053ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి 2009లోనూ గెలిచారు. 2013లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ నుండి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు శాసనసభ నియోజకవర్గం నుండి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఆళ్ల నాని 2024 శాసనసభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలై అనంతరం 2024 ఆగష్టు 17న వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన 2025 ఫిబ్రవరి 13న టీడీపీలో చేరారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.