
Provident Fund : ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల నెలవారీ వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటివరకు నెలకు రూ.15 వేల వరకు వేతనం ఉన్న ఉద్యోగులు పీఎఫ్ పరిధిలోకి వచ్చేవారు. తాజాగా ఈ పరిమితిని రూ.25 వేలకు పెంచడంతో ఇకపై మరింత మంది ఉద్యోగులు పీఎఫ్ ప్రయోజనాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read : ఉదయం 6 గంటలకే ఊస్టింగ్ మెయిల్స్.. ఉద్యోగులకు ఒరాకిల్ ఊహించని షాక్.. వివరాలివే!
ఈ నిర్ణయం వల్ల ప్రతి సంవత్సరం ప్రభుత్వంపై సుమారు రూ.11,339 కోట్ల అదనపు వ్యయం పడనుంది. ఉద్యోగులకు సామాజిక భద్రతను మరింత విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. గతంలో రూ.15 వేల వేతన పరిమితి కారణంగా పీఎఫ్ పరిధిలోకి రాని ఉద్యోగులు ఇప్పుడు ఈ ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నెలకు రూ.15 వేల కంటే ఎక్కువ, రూ.25 వేల లోపు వేతనం పొందుతున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం ఉపయోగపడనుంది.
పీఎఫ్ ద్వారా ఉద్యోగులు పనిచేస్తున్న సమయంలోనే భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో దీర్ఘకాలికంగా ఆర్థిక భద్రతను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. వేతన పరిమితి పెరగడంతో మరింత మంది ఉద్యోగులు అధికారిక సామాజిక భద్రత వ్యవస్థలోకి వస్తారని కేంద్రం తెలిపింది. అలాగే ఉద్యోగులకు మరిన్ని ఉద్యోగ ప్రయోజనాలు అందుబాటులోకి రావడంతో సంస్థల్లో సిబ్బందిని కొనసాగించడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
మొత్తంగా పీఎఫ్ పరిధిని విస్తరించడం ద్వారా ఎక్కువ మంది ఉద్యోగులకు దీర్ఘకాలిక పొదుపు, సామాజిక భద్రత ప్రయోజనాలు అందించడమే కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ కోసం ప్రభుత్వం ఏటా రూ.11,339 కోట్లను ఖర్చు చేయనుంది.
Also Read : రూ.3,300 కోట్ల ఆస్తులు.. ముంబై వీధుల్లో బిచ్చగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే?









