Jakkidi Shiva Charan Reddy : ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభాగాలు తీవ్రస్థాయికి చేరాయి. పార్టీ నాయకుల మధ్య మొదలైన వర్గపోరు చివరకు పరస్పర దాడులు, రచ్చకెక్కే పరిస్థితులకు దారితీసింది. మన్సూరాబాద్‌లోని తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి నివాసం వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Also Read : తిరుమలలో మళ్లీ చిరుత హల్‌చల్: భయంతో పరుగులు తీసిన భక్తులు!

ఈ వివాదానికి ప్రధాన కారణం ఒక ఫ్లెక్సీకి సంబంధించిన గొడవేనని తెలుస్తోంది. యాదగిరిగుట్ట దేవాలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్‌కు సంబంధించిన ఫ్లెక్సీలో నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో ఎందుకు వేయలేదంటూ సురేష్ యాదవ్ అనే వ్యక్తిపై శివచరణ్ రెడ్డి తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దీనికితోడు ఈశ్వరమ్మ యాదవ్‌పై కూడా శివచరణ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో బీసీ, యాదవ సంఘాల నేతలు, ఈశ్వరమ్మ యాదవ్ మద్దతుదారులు ఆగ్రహానికి గురయ్యారు.

ఆగ్రహంతో రగిలిపోయిన ఈశ్వరమ్మ యాదవ్ వర్గీయులు, యాదవ సంఘాల నేతలు పెద్ద ఎత్తున ఎల్బీనగర్, మన్సూరాబాద్‌లోని శివచరణ్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఆయన ఇంటిపై ఒక్కసారిగా దాడికి దిగి, కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిని గమనించిన శివచరణ్ రెడ్డి అనుచరులు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు వెంటనే వారిని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగి, పరిస్థితి చేజారిపోయింది.

Also Read : కడపలో మళ్లీ కరోనా కలకలం: రిమ్స్‌లో రెండు కేసులు నమోదు, వైద్యారోగ్య శాఖ గోప్యతపై ప్రజల ఆగ్రహం!

ఇరువర్గాలు క‌ర్ర‌లు, రాళ్ల‌తో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడుల‌కు దిగడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఈ ఘర్షణతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి వాతావరణాన్ని శాంతింపజేశారు.

ప్రస్తుతం ఎల్‌బీ నగర్, మన్సూరాబాద్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘర్షణకు గల పూర్తి ఆధారాలను, సిసిటివి దృశ్యాలను సేకరిస్తున్న పోలీసులు, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.