
నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురవనున్నాయిని వాతావరణ శాఖ తెలిపింది. రెండు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మరికొన్ని చోట్ల పొడి వాతావరణంతో పాటు ఎండ, ఉక్కపోత తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రోజంతా కాస్త ఎండగా ఉన్న సాయంత్రం సమయాల్లో వాతావరణం కాస్త చల్లబడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : ఏపీలో ఇరుముడి సినిమా రిపీట్.. అక్కడ టీచర్.. ఇక్కడ వంట మనిషి!
ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములతో కూడిన జల్లులు కురవవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. అయితే తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మత్స్యకారులు వేటకు వెళ్లవదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచించారు.
Also Read : స్విగ్గీ, జెప్టో, ఫ్లిప్‌కార్ట్ స్టోర్లపై టీజీ సేఫ్ దాడులు… బయటపడ్డ సంచలన లోపాలు









