Aditya Birla Capital : ఆర్థిక రంగ సంస్థగా గుర్తింపు పొందిన ఆదిత్య బిర్లా క్యాపిటల్‌ కీలక ప్రకటన చేసింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థగా ఇప్పటికే రాణిస్తున్న ఆదిత్యా బిర్లా బంగారం రుణాల వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నట్లు ప్రకటించింది. రాబోయే మూడేళ్లలో దేశ వ్యాప్తంగా మొత్తం 1,000 బంగారు రుణాల శాఖలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడిచింది. తొలిదశలో భాగంగా 2027 చివరి నాటికి 300 శాఖలు ప్రారంభిస్తామని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Also Read : భార్యను, చెల్లిని కాల్చిచంపి ఆ పై ఆత్మహత్య.. వాట్సాప్ స్టేటస్ లో కీలక విషయం..

దేశంలో బంగారు రుణాలు బలమైన వృద్ధిని నమోదుచేస్తున్నాయని అందుకే ఈ రంగంలోకి అడుగు పెడుతున్నామని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాకేశ్‌ సింగ్ వెల్లడించారు. వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నట్టు ఆయన తెలిపారు. త్వరలోనే పట్టణాల్లో, నగరాల్లో మార్కెట్‌ను విస్తరిస్తామని తెలిపారు. డిజిటల్‌ ప్లాట్‌ఫాం, రిటైల్‌ స్టోర్‌లలో బంగారు రుణాలు కొత్త వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని ఆయన వివరించారు.

మారుతున్న భౌగోళిక పరిస్థితుల కారణంగా బంగారానికి డిమాండ్‌ పెరిగిందని మార్కెట్‌ వర్గాలు వెల్లడించారు. అంతేకాక బంగారం సురక్షిత పెట్టుబడిగానూ మారిందని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఎన్‌బీఎఫ్‌సీ కంపెనీలు బంగారు రుణాల వ్యాపారం వైపు అడుగులు వేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలను తీసుకుని చెల్లించి తిరిగి బంగారాన్ని పొందొచ్చు అనే నమ్మకం రుణగ్రహీతల్లో పెరగడంతో గోల్డ్‌ లోన్‌లకు డిమాండ్‌ అధికంగా పెరిగిందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే పలు సంస్థలు బంగారు రుణాల మార్కెట్‌ లోకి అడుగు పెడుతున్నాయి. జూన్ 2026 నాటికి ఎన్‌బీఎఫ్‌సీల బంగారు రుణాల పోర్ట్‌ఫోలియో 69.3 శాతం వృద్ధి పెరిగి రూ.3.42 లక్షల కోట్లకు చేరినట్లు ఘనంకాలు చెబుతున్నాయి.

Also Read : అదిరిందయ్యా విజయ్.. ప్రతీ MLAకు ఓ కొత్త కారు.. డ్రైవర్, ఆయిల్ కు నెలకు రూ.75 వేలు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.