
బంగారాన్ని(Gold) తయారు చేయడం అంటే పూర్వ కాలంలో రసవాదం అనేవారు. అప్పట్లో కొందరు మంత్రగాళ్లు, సిద్ధులు రాళ్లు, రప్పలు లేదా వేరే ఏవో ద్రవాలను బంగారంగా మారుస్తారని కథలుగా చెప్పుకునేవారు. కానీ.. ఒక పదార్థాన్ని మరొక పదార్థంగా ముఖ్యంగా బంగారంగా మార్చడం అనేది కేవలం కథల్లో, సినిమాల్లోనే సాధ్యమని.. నిజ జీవితంలో అది అసాధ్యమని ఇప్పటివరకు ప్రపంచం నమ్మింది. అయితే యుగయుగాలుగా మనుషులు కంటున్న ఈ అతిపెద్ద కలను ఇప్పుడు ఆధునిక సైన్స్ నిజం చేసి చూపించింది.
సాధారణ రసాయనాలతో బంగారాన్ని తయారు చేయడం కుదరదని అందరూ అనుకుంటున్న వేళ అమెరికాకు చెందిన ‘మారథాన్ ఫ్యూజన్’ అనే స్టార్టప్ సంస్థ ఒక సంచలన విషయాన్ని బయటపెట్టింది. అణు సంలీన సాంకేతికతను ఉపయోగించి ప్రమాదకరమైన పాదరసాన్ని(Mercury) అసలైన బంగారంగా మార్చడంలో తాము విజయం సాధించామని ప్రకటించింది. ప్రసిద్ధ పరిశోధనా సంస్థ సెర్న్ గతంలో సాధించిన ఉత్పత్తి రికార్డు కంటే ఇది ఏకంగా 10 రెట్లు వేగవంతమైనదని వెల్లడించింది.
Also Read : భూమివైపు దూసుకొస్తున్న నాసా స్విఫ్ట్ టెలిస్కోప్.. ఎక్కడ పడబోతుందంటే?
A startup says it turned mercury into real gold. Gold isn’t going anywhere: one year of mining would take hundreds of fusion plants.
The real story is the medicine. Same neutron, about 10 billion times more valuable.
Gold or medicine, which would you back? https://t.co/GOMQxD2HWe
— Olivent Venture Capital (@OliventVC) November 1, 2026
అసలు పాదరసం బంగారంగా ఎలా మారింది? సాధారణంగా మనం చూసే రసాయన మార్పులు పరమాణువుల పైపైన మాత్రమే జరుగుతాయి. కానీ ఒక మూలకాన్ని మరొక మూలకంగా మార్చలేవు. కానీ అమెరికా శాస్త్రవేత్తలు ‘న్యూక్లియర్ ట్రాన్స్మ్యుటేషన్’ అనే అత్యంత సంక్లిష్టమైన అణు పద్ధతిని ఉపయోగించారు. ఇందులో భాగంగా ఫ్యూజన్ చర్యల్లో వెలువడే అధిక శక్తి కలిగిన న్యూట్రాన్లను పాదరసంపైకి వేగంగా ప్రయోగించారు. దీనివల్ల ఆ పాదరసం ముందుగా ఒక రేడియోధార్మిక రూపంలోకి మారి ఆ తర్వాత కొద్ది సమయానికి స్వయంచాలకంగా క్షీణించి పూర్తిగా స్థిరమైన గోల్డ్-197గా రూపాంతరం చెందింది.
గతంలో అనగా 2025లో స్విట్జర్లాండ్లోని సెర్న్ శాస్త్రవేత్తలు కూడా అతి తక్కువ ప్రమాణంలో బంగారాన్ని తయారు చేసి రికార్డు సృష్టించారు. కానీ ఈ అమెరికా కంపెనీ అంతకంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో పసిడిని తయారు చేయగలిగింది. భవిష్యత్తులో గనుక పెద్ద ఎత్తున అణు రియాక్టర్లు అందుబాటులోకి వస్తే ఒక్కో పవర్ ప్లాంట్ నుంచి ఏడాదికి దాదాపు రెండు టన్నుల కృత్రిమ బంగారాన్ని తయారు చేయవచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. అంతేకాకుండా క్యాన్సర్ వ్యాధిని గుర్తించడానికి, చికిత్స చేయడానికి ఉపయోగించే విలువైన ఔషధ పరికరాల తయారీకి కూడా ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ గొప్ప ఆవిష్కరణపై సైన్స్, ఆర్థిక నిపుణులు కాస్త నిలకడగా ఆలోచించాలని సూచిస్తున్నారు. ఎందుకంటే మారథాన్ ఫ్యూజన్ సంస్థ తాము తయారు చేసిన బంగారం పరిమాణం ఎంత? దానిని బయటకు తీయడానికి ఎంత ఖర్చవుతుంది? అది మార్కెట్ ధరలకు సరిపోతుందా? అనే పూర్తి వివరాలను ఇంకా బయటపెట్టలేదు. ఈ ప్రయోగంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read : సైరన్ మోగింది.. అణు బాంబు వస్తోంది.. రష్యాను ఊపేసిన బిగ్గెస్ట్ సైబర్ ట్విస్ట్!









