ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఊహించని బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి హవా స్పష్టంగా కనిపిస్తుంటే.. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో మాత్రం సీన్ రివర్స్ అయింది. కూటమి ప్రభంజనాన్ని తట్టుకుని అక్కడ వైఎస్సార్‌సీపీ క్లీన్ స్వీప్ దిశగా అద్భుత విజయాన్ని అందుకుంది. దీని మెయిన్‌గా రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి కూటమి నేతల్లో విభేదాలు, రెండు వైసీపీ లీడర్ బైరెడ్డి సిద్దార్ధ రెడ్డి ప్లానింగ్.

వన్ మ్యాన్ ఆర్మీలా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి

నందికొట్కూరులో వైసీపీ ఈ రేంజ్ సక్సెస్ సాధించడం వెనుక యువనేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యూహాత్మక ప్లానింగ్ ప్రధాన కారణంగా నిలిచింది. నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే మున్సిపాలిటీపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బైరెడ్డి, గ్రౌండ్ లెవెల్‌లో గట్టిగా వర్క్ చేశారు. యూత్ కేడర్‌లో ఆయనకున్న క్రేజ్, మాస్ ఫాలోయింగ్ పార్టీకి భారీ ప్లస్ పాయింట్‌గా మారాయి. పక్కా స్ట్రాటజీతో లీడ్ తీసుకుని ఎన్నికల బరిలో నిలబడటంతో క్యాడర్‌లో సరికొత్త జోష్ వచ్చింది. ఈ రిజల్ట్‌తో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మరోసారి స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు.

కూటమికి దెబ్బకొట్టిన గ్రూప్ పాలిటిక్స్

రాష్ట్రమంతా కూటమి దూకుడు ప్రదర్శిస్తే, ఇక్కడ మాత్రం పూర్తిగా చతికిలపడటానికి అంతర్గత విభేదాలే ప్రధాన కారణమని పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. టీడీపీలో మూడు వర్గాలు ఉన్నాయన సమాచారం. ఎంపీ బైరెడ్డి శబరి & రాజశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యే జయసూర్య & మాండ్ర శివానందరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి వీరి మధ్య సక్యత లేకనే అక్కడ కూటమి అభర్థి గెలవలేకపోయాడని టాక్.  స్థానిక టీడీపీ, జనసేన నేతల మధ్య సమన్వయం లోపించడం, టికెట్ల కేటాయింపు నుంచి ప్రచారం వరకు గ్రూప్ తగాదాలు కొనసాగడం కూటమికి తీవ్ర నష్టం కలిగించింది. కూటమిలోని ఈ ఇంటర్నల్ గ్రూపిజమ్‌ను బైరెడ్డి టీమ్ పక్కాగా క్యాష్ చేసుకుని ఎన్నికల్లో వైసీపీని తిరుగులేని విజయతీరాలకు చేర్చింది.

32 వార్డుల్లో 23 చోట్ల ఫ్యాన్ గాలి

నందికొట్కూరు మున్సిపాలిటీలోని మొత్తం 32 వార్డులకు గానూ ఏకంగా 23 వార్డుల్లో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు ఘన విజయం సాధించి జెండా పాతారు. దీంతో నందికొట్కూరు మున్సిపల్ పీఠం తిరుగులేని మెజార్టీతో వైఎస్సార్‌సీపీ సొంతమైంది.