Konda Surekha : ఇటీవల మంత్రి కొండా సురేఖ పుట్టిన రోజు సందర్భంగా ఆమె కూతురు కొండా సుస్మిత పరకాల నియోజకవర్గం గీసుకొండలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌ పార్టీలో దుమారం లేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొండా సురేఖను పార్టీ నుంచి బహిష్కరిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. ఒకవేళ ఆమెను పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆమె బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.ఈ క్రమంలోనే బీజేపీ హైకమాండ్..కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. స్వయంగా అమిత్‌ షా కొండా మురళితో మాట్లాడినట్లు ప్రచారం సాగుతోంది. మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని అమిత్ షా సంప్రదించినట్టు సమాచారం అందుతోంది.క్యాబినెట్ నుంచి సురేఖను తొలగించే అవకాశం ఉందన్న ప్రచారం నేపథ్యంలో సీన్‌లోకి బీజేపీ ఎంట్రీ ఇవ్వటం సంచలనంగా మారింది. కొండా సురేఖ దంపతులను బీజేపీలోకి రావాలని అమిత్ షా ఆహ్వానించినట్టు రాజకీయ వర్గాల భోగట్టా!

Also Read : శ్రీశైలం సత్రంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య!

అయితే ఘటన జరిగినప్పటి నుంచి కొండా ఫ్యామిలీ ఇంతవరకు స్పందించలేదు. దీంతో వారు వ్యూహం ఏంటనే విషయం ఎవరికీ అంతుచిక్కడం లేదు.కొండా మౌనంపై పొలిటికల్ సర్కిల్‌లో చర్చ సాగుతోంది. నిన్నటి నుంచి హనుమకొండ లోని ఇంట్లోనే సురేఖ ఉన్నారు. ఈ క్రమంలో ఎవరినీ కలిసేందుకు కూడా సురేఖ అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.వివాదం ఢిల్లీకి చేరినప్పటికీ కొండా ఫ్యామిలీ ఏమాత్రం తగ్గడం లేదు. అధిష్టానం ఏం చేస్తుందో చూద్దాం అనే కోణంలోనే వారున్నట్లు తెలుస్తోంది. అధిష్టానం తీసుకునే నిర్ణయం పైనే మా నిర్ణయం ఆధారపడి ఉంటుందని కొండా సురేఖ అంటున్నట్లు తెలుస్తోంది. అప్పటిదాకా స్పందించేది లేదని కొండా సురేఖ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కొండా ఫ్యామిలీకి బీజేపీ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ జాతీయ నేత, హోం మంత్రి అమిత్‌షా స్వయంగా పోన్‌ చేసి పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే,అమిత్‌షా ఆఫర్‌కు కొండా ఫ్యామిలీ ఓకే చెప్తుందా అనేది తేలాల్సి ఉంది. అలాగే కొండా ఫ్యామిలీకి బీజేపీలో ఫ్యూచర్ ఉందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.కొండా కుటుంబాన్ని కాంగ్రెస్ వదులుకుంటుందా అనే చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా అసలు కొండా సురేఖను సస్పెండ్‌ చేస్తారా? చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేది సస్పెన్స్‌గా మారింది.

Also Read : రెండు నౌకలను హైజాక్‌ చేసిన సముద్రపు దొంగలు.. నౌకల్లో 22 మంది ఇండియన్స్‌

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.