Canada :  కెనడాలో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్న భారతీయ విద్యార్థులకు ఇది నిజంగా బిగ్ షాక్‌ అని చెప్పాలి. 2026 సెప్టెంబర్ 1, నుంచి కెనడా స్టడీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు గతంలో కంటే ఎక్కువ డబ్బు తమ వద్ద ఉన్నట్లు చూపించాలి. కెనడాలోని క్యూబెక్ మినహా మిగతా ప్రావిన్సులు, టెరిటరీల్లో చదువుకోవాలనుకునే ఒక్క విద్యార్థి.. ఏడాది జీవన ఖర్చుల కోసం కనీసం 23,448 కెనడియన్ డాలర్లు ఉన్నట్లు చూపించాలి. ఈ మొత్తం కాలేజీ లేదా యూనివర్సిటీ ఫీజులు, ప్రయాణ ఖర్చులకు అదనం.

Also Read : 26వ తేదీ అంటేనే ప్రకృతి విపత్తులా..? 96 ఏళ్లుగా వెంటాడుతున్న సెంటిమెంట్!

అయితే ఇప్పుడు ఈ మొత్తాన్ని ప్రతి ఏడాది మారుస్తున్నారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా, ఎవరైనా వారిని మోసం చేయకుండా ఉండటమే ఈ మార్పు ఉద్దేశమని IRCC తెలిపింది. ఇప్పటివరకు ఒక్క విద్యార్థి చూపించాల్సిన మొత్తం CAN$22,895గా ఉంది. ఇది 2025 జనవరి 1 నుంచి 2026 ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసిన వారికి వర్తించింది. ఇప్పుడు ఈ మొత్తం CAN$553 పెరిగింది.

విద్యార్థితో పాటు కుటుంబ సభ్యులు కూడా కెనడాకు వెళ్తే చూపించాల్సిన మొత్తం మరింత పెరుగుతుంది. విద్యార్థితో కలిపి ఇద్దరు ఉంటే ఏడాదికి CAN$29,192 చూపించాలి. ముగ్గురు కుటుంబ సభ్యులు ఉంటే CAN$35,888, నలుగురు ఉంటే CAN$43,572 ఉండాలి. అయితే కేవలం ఎంత డబ్బు ఉందన్నదే కాకుండా.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనే విషయాన్ని కూడా IRCC పరిశీలిస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. CAN$23,448 నిబంధన క్యూబెక్‌కు వర్తించదు. క్యూబెక్‌లో చదువుకోవాలనుకునే విద్యార్థులు అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన ప్రత్యేక ఆర్థిక నిబంధనలను పాటించాలి.

Also Read : పాకిస్థాన్‌లో 100 ఏళ్లకు పైబడిన హిందూ ఆలయం కూల్చివేత!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.