
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో జరుగుతున్న ఆసియాన్ (ASEAN) సదస్సులో ప్రధాని మోదీ ప్రత్యేకంగా అలంకరించిన ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో ప్రయాణించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఈ వీడియోపై పాకిస్తాన్ నెటిజన్లు చేస్తున్న తప్పుడు ప్రచారానికి భారతీయ యూజర్లు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Narendra Modi takes a ride in a Made-in-Pakistan E-Rickshaw at the ASEAN Summit in the Philippines 🔥 https://t.co/D2AAy8Zswo
— ♛ObsidianDefence♛ (@Obsidian_Pk012) November 17, 2026
Also Read : బంగ్లాదేశ్‌లో బందీగా BSF జవాన్.. 5 గంటల హైడ్రామా!
అసలేం జరిగింది?
నవంబర్ 17న మనీలాలో జరిగిన ఆసియాన్ సదస్సు సందర్భంగా ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రపంచ దేశాల అధినేతలకు ప్రత్యేక విందు ఏర్పాటు చేసింది. ఈ విందుకు హాజరయ్యే నాయకుల కోసం ఆ దేశ సంప్రదాయ ‘జీప్నీ’ వాహనాల కళారూపాలను పోలిన రంగురంగుల ఆటో రిక్షాలను సిద్ధం చేశారు. ప్రధాని మోదీ ఈ ప్రత్యేక ఆటోలో ప్రయాణిస్తున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది.
The Bajaj auto that was used at the Asean summit.
PM Modi, world leaders travelled on these autos to the Asean Gala dinner summit venue yesterday https://t.co/ClqS5Yxph2
— Sidhant Sibal (@sidhant) November 17, 2026
Also Read : ఐపీఎల్‌కు మహేంద్ర సింగ్ ధోని గుడ్‌బై.. ఇకపై సీఎస్కే కొత్త మెంటార్‌గా మహీ!
పాకిస్తాన్ ఫేక్ ప్రచారం బట్టబయలు
ఈ వీడియో వైరల్ కావడంతో, మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్తాన్లో తయారైందంటూ ఆ దేశానికి చెందిన కొందరు సోషల్ మీడియా యూజర్లు ప్రచారం మొదలుపెట్టారు. లాహోర్‌కు చెందిన జర్నలిస్ట్ హమ్మద్ హసన్ సైతం ఇది ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ ఆటో రిక్షా అంటూ పోస్ట్ పెట్టారు.
అయితే, ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది. ఆ ఆటో రిక్షా వీడియోను క్షుణ్ణంగా పరిశీలించగా, దాని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌పై భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో లోగో స్పష్టంగా కనిపించింది. దీంతో ఆ వాహనం పాకిస్తాన్‌ది కాదని, మన దేశానికి చెందిన బజాజ్ కంపెనీ తయారు చేసిందని నిరూపితమైంది. ఈ లోగోను హైలైట్ చేస్తూ భారత నెటిజన్లు పాకిస్తాన్ తప్పుడు ప్రచారాన్ని ఎండగడుతూ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.
పాకిస్తాన్‌కు చెందిన ‘సాజ్గర్’ అనే ఆటోమొబైల్ సంస్థ గత నెలలోనే ఫిలిప్పీన్స్‌లోని లగువా ప్రాంతంలో తన తొలి విదేశీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది. ఆగ్నేయాసియాలో మార్కెట్ విస్తరించేందుకు ఆ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆసియాన్ సదస్సులో వాడిన ఆటోలు కూడా తమ దేశానివేనని పాక్ నెటిజన్లు భ్రమపడి తప్పుడు ప్రచారం చేశారు.
నిజానికి బజాజ్ ఆటో 2015లోనే ఫిలిప్పీన్స్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి అక్కడి త్రీ-వీలర్ మార్కెట్లో తిరుగులేని గుర్తింపు సంపాదించుకుంది. ఫిలిప్పీన్స్‌లో సొంత అసెంబ్లీ యూనిట్లు, బలమైన డీలర్ నెట్‌వర్క్‌ను కూడా బజాజ్ ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు బజాజ్ తన వాహనాలను ఎగుమతి చేస్తూ గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతోంది.









