
English Channel : తమ తమ దేశాలలో జీవనోపాధి లేకపోవడం, అంతర్యుద్ధాలు తదితర అనేక కారణాలతో పలు దేశాలకు చెందిన పౌరులు ఇతర దేశాల్లో బతుకు తెరువు వెతుక్కుంటూ వలసలు పోతుంటారు. అలాంటిదే వివిధ దేశాలకు చెందిన పలువురు వలసదారులు గత కొంతకాలంగా అక్రమంగా యూరప్ దేశాలకు వలసవెళ్తున్నారు. వివిధ దేశాలకు చెందిన పలువురు వలసదారులు ముఖ్యంగా ఫ్రాన్స్, బ్రిటన్‌లకు వేలాదిగా తరలివెళ్తున్నారు. ఆయా దేశాలకు వెళ్లడానికి వలసదారులు అత్యంత ప్రమాదకర ప్రయాణాన్ని ఎంచుకుంటున్నారు. దీంతో చాలామంది తీరం చేరకుండానే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
నిజానికి ఈ మార్గంలో ప్రయాణించడానికి ఎలాంటి అనుమతులు లేకపోవడం మూలంగా వారంతా మార్గమధ్యలో ఇబ్బందులు ఎదుర్కొనక తప్పడం లేదు. వలసదారులంతా నాటుపడవలు, సరైన ప్రమాణాలు పాటించని బోట్లు, ఇతర ప్రమాదకర స్థితిలో సముద్రం దాటే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో కొన్నిసార్లు అవి ప్రమాదాలకు గురై.. వారిలో చాలామంది మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
Also Read : త్వరలో పాక్, ఇండియా క్రికెట్ మ్యాచ్.. ఎక్కడో తెలుసా?
తాజాగా ఇంగ్లిష్ ఛానెల్‌లో ఇలాంటి ఒక ఘటనే ఎదురైంది. వందలాది మంది వలసదారులతో కూడిన ఒక బోటు ఫ్రాన్స్ నుంచి బ్రిటన్ కు పయనమైంది. ఈ బోటు మంగళవారం తెల్లవారు ఝామున సముద్రంలో ఉండగానే అగ్నిప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బోటు కెనడా, బ్రిటిష్ కొలంబియా, వెర్నాన్ పరిధిలోకి చేరుకోగానే అందులో ఉన్నట్లుండి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదాన్ని పసిగట్టిన బోటులోని సిబ్బంది రెస్క్యూ టీంలకు సమాచారం అందించారు. దీంతో రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే బోటు చాలా వరకు అగ్నికి ఆహుతైంది. అయినప్పటికీ రెస్క్యూ బృందాలు శ్రమించి, దాదాపు 157 మంది వలసదారుల్ని రక్షించాయి. అయితే ఈ ఘటనలో ఎవరైనా బాధితులు మృతి చెందారా అనే వివరాలు తెలియరాలేదు. రెస్క్యూ సిబ్బంది తోపాటు బ్రిటన్‌తోపాటు ఫ్రాన్స్‌కు చెందిన సిబ్బంది కూడా మరి కొందరిని రక్షించారు.
నిజానికి ఇంగ్లిష్ ఛానెల్ అత్యంత ప్రమాదకరమైన మార్గంగా చెబుతుంటారు. అయితే అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ఆయా దేశాల వలసదారులు ఎక్కువగా ఈ మార్గాన్నే ఎంచుకుంటారు. నౌకలు, పడవల్లో ఈ జలమార్గంలో ప్రయాణిస్తూ యూరప్‌కు వలస వెళ్తుంటారు. కొన్నిసార్లు ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుని మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోతుంటారు. 2018-2025 మధ్య 168 మంది వలసదారులు ఈ మార్గంలో ప్రయాణిస్తూ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Also Read : 5.4 తీవ్రతతో ఈజిప్ట్‌లో భూకంపం









