
Danam Nagender : SIR ప్రక్రియ అమలు, ఓట్ల తొలగింపు విషయంలో మాట్లాడుతూ ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. SIR గురించి రాహుల్ గాంధీ పదేపదే ఎందుకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓటు చోరీ జరిగిందనే కదా.. ఇపుడు మా నియోజకవర్గంలో ప్రత్యేకంగా 20 వేల ఓట్లు తొలగించినట్లు నా దృష్టికి వచ్చింది. వారికి నోటీసులు ఇచ్చారు. దాన్ని రెక్టిఫై చేయాలి. ఓటు చోరీ జరిగిందని మేము అందుకే చెబుతున్నాం అని దానం స్పందించారు.
Also Read : ఖైరతాబాద్ ఉప ఎన్నికపై బిగ్ ట్విస్ట్… హైకోర్టులో విజయారెడ్డి ఫిటిషన్
మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు
హైదరాబాద్ ఎన్నికల కమిషన్ కార్యాలయం తగలబెడతాం
ఓట్ల తొలగింపులో ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోకపోతే ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు హైదరాబాద్ నగరం తగలబడిపోతుంది pic.twitter.com/EXE6arA4Lb
— Telugu Feed (@Telugufeedsite) October 1, 2026
“నా నియోజకవర్గంలో ఇప్పటివరకు 20 వేల ఓట్లు కట్ చేశారు. ఇంకా ఎన్ని పోయినయో తెల్వదు. దీనిపై ఎలక్షన్ కమిషన్‌కు కంప్లైంట్ ఇస్తాను. ఇందులో కొంతమంది బీజేపీకి అమ్ముడు పోయి, బీజేపీతో కుమ్మక్కై పెద్ద ఎత్తున ఓట్లు తీసేసే ప్రక్రియ చేస్తున్నారు. కాబట్టి నేను ఇపుడు కమిషన్ కు కంప్లైంట్ ఇవ్వడానికి పోతున్న. ఎవరైతే బీజేపీకి అమ్ముడు పోయి మా ఓట్లు తీపించాలని ప్రయత్నం జరుగుతుందో దీనిమీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే జన్యున్ ఓటర్లు అంటే 2002లో 2023లో గానీ ఉండే, ఇపుడు కూడా ఉండే , మొన్న పార్లమెంట్లో కూడా ఉండే అలాంటిది ఇపుడు మాత్రం తీసేశారు. కాబట్టి పెద్ద ఎత్తున ఓటు చోరి జరుగుతుంది కాబట్టి దాని నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది.
Also Read : కేటీఆర్‌కు హైటెక్‌సిటీలో 190 గదుల ఫైస్టార్ హోటల్..సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఇప్పటివరకు ఎవైతే డిలీట్ చేశారో 20 వేల ఓట్లు మళ్లీ వాటిని తిరిగి చేర్చి వారికి ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాహుల్ గాంధీ చెప్పినట్లు ఆందోళన కంటిన్యూగా ఉంటది. ఉప ఎన్నికలు నిర్వహించాలన్నా, ఏ ఎన్నిక నిర్వహించాలన్నా ఓటుహక్కును తీసేసి ఎన్నికలకు పోవడం అనేది దురదృష్టకరం, కాబట్టి ఇప్పుడున్న 20 వేల ఓట్లు ఎందుకు తీసేశారు. ర్యాండమ్‌గా బంచ్లు బంచ్లుగా ఆన్లైన్లో ఢిల్లీ్కి పంపుతున్నారు. అక్కడ అటోమెటిక్‌గా డిలీట్ అయి పోతున్నాయి. అంటే ఢిల్లీలో కూర్చొని మానిటర్ చేస్తున్నారు వీళ్లందరూ. దీంతో స్థానికంగా ఉండేవారి కంట్రోల్ లేకుండా పోతుంది. ఎవరి అప్రూవల్ లేకుండా పోతుంది. డైరెక్ట్‌గా డిలీట్ అయిపోతున్నాయి. దీనిపై పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది కాబట్టి దీన్ని ఎట్ల కాపాడుకోవాలో మాకు తెలుసు. దీనిమీద చర్య కూడా తీసుకోవాలి. ఎవరైతే అధికారులు బీజేపీతో కుమ్మక్కై ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. కాగా, దానం వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో ఎన్నికల కమిషన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.









