
Khairatabad By Poll : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు నేపథ్యంలో త్వరలో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఉప ఎన్నిక నిర్వహించవద్దంటూ పీజేఆర్ కూతురు పి. విజయారెడ్డి హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ఎన్నికల నిర్వహణను ప్రస్తుతానికి నిలిపివేయాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దానం ఎన్నికకు సంబంధించిన పిటిషన్ ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఈ తరుణంలో ఉపఎన్నికలను నిర్వహించడం సరికాదని విజయారెడ్డి తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం చర్చనీయంశంగా మారింది. ఈ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం విచారణ చేపట్టింది.
Also Read : రాజస్థాన్‌తో ఒప్పందం రద్దు చేసుకోండి.. ప్రభుత్వానికి హరీశ్‌రావు డిమాండ్
ఖైరతాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయొద్దని కోరుతూ పీజేఆర్ కుమార్తె, కాంగ్రెస్ నేత విజయారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. భైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించడానికి వీలులేదని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ తరుణంలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఆపాలంటూ విజయారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. 2024లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం నాగేందర్ ఎన్నికను సవాల్ చేస్తూ విజయారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించకూడదని ఆమె కోరారు. అప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీ (ECI)ని ఆదేశించాలని ఆమె హైకోర్టును కోరారు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన దానం ఎన్నికల అఫిడవిట్లో తన భార్య, ఇతర కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను వెల్లడించలేదని ఆరోపిస్తూ విజయారెడ్డి 2024లో హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరిన ఈ పిటిషన్ ప్రస్తుతం కోర్టులో విచారణ దశలో ఉంది. ఈ సందర్భంగా అప్పటి వరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీ (ECI)ని ఆదేశించాలని విజయా రెడ్డి కోరారు. తన పిటిషన్లో ఎన్నికల సంఘం, దానం నాగేందర్లను ప్రతివాదులుగా చేర్చారు.
కాగా, పీజేఆర్ మరణానంతరం విజయా రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. దానం అప్పటికే పీజేఆర్‌కు శిశ్యుడిగా ఉన్నారు. అయితే ఆ తర్వతా వీరిద్దరి మధ్య రాజకీయంగా విభేదాలు ఏర్పడ్డాయి. కొంత కాలంగా ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్ టికెట్ తనదేనని విజయారెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. పీజేఆర్ సెంటిమెంట్‌తో పాటు నియోజకవర్గంలో ఆమెకున్న బలమైన పట్టుతో కాంగ్రెస్ అధిష్ఠానం కూడా ఆమె వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, అనర్హత వేటు పడినప్పటికీ దానం నాగేందర్ వర్గం కూడా టికెట్ రేసులో తామే ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తుంది. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ యుద్ధం మరింత ముదిరింది. ఈ సమయంలో విజయా రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇటు దానం నాగేందర్ ఉప ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే సమాధానం ఇస్తానని చెప్పుకుంటున్నారు. ఇక.. ఇప్పుడు విజయారెడ్డి ఏకంగా ఎన్నిక నిలుపుదల కోసం కోర్టును ఆశ్రయించింది.
కాగా ఖైరతాబాద్ ఉప ఎన్నిక అంశంలో మాజీ మంత్రి పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు లో విచారణ జరిగింది. అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
Also Read : ఎస్సార్‌నగర్ యువతి హత్య కేసులో సంచలన విషయాలు









