
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ఇటీవల రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విదేశీ పర్యటన రద్దు కావడంతో తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. క్రమంలో రేవంత్ రెడ్డి సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పందించారు. లండన్ పర్యటనకు అనుమతించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ, అమెరికా పర్యటనకు మాత్రం అనుమతిని నిరాకరించి రద్దు చేసింది. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై ప్రధాని మోదీ కుట్ర పన్నారని ఆరోపించారు.
Also Read : తెలుగు సినిమాలకు గోల్డెన్ టైమ్.. 62 రోజులు 6 హిట్లు.. దర్శకులే కింగ్!
— RTV (@RTVnewsnetwork) August 24, 2026
తెలంగాణ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు విదేశీ చదువులు, క్రీడలు, పారిశ్రామిక పెట్టుబడులే లక్ష్యంగా తమ ప్రభుత్వం పక్కా కార్యాచరణ రూపొందించుకుందని తెలిపారు. ఈ అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖకు అందించామని, కార్యక్రమాలన్నీ భారత రాయబార కార్యాలయం పర్యవేక్షణలోనే జరుగుతాయని స్పష్టం చేశారు. అయినప్పటికీ విదేశాంగ శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతించి, అమెరికా పర్యటనకు రాజకీయ కారణాలతో అనుమతి నిరాకరించడాన్ని అందరూ తప్పుపడుతున్నారని మండిపడ్డారు.
ఈ నిర్ణయాన్ని తిరస్కరించడమే కాకుండా బీజేపీ నాయకులు ప్రభుత్వంపై, అధికారిక పర్యటనపై తప్పుడు ప్రకటనలు చేస్తూ తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని రేవంత్ రెడ్డి మండిపడ్డడారు. ఇది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్న అధికారిక అంశమని, తాము రాజకీయాలను ప్రస్తావించదలచుకోలేదని పేర్కొన్నారు. పర్యటనను తిరస్కరించడానికి చూపిన ‘రాజ్యకీయ కారణాలు’ ఏంటో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ‘వైబ్రంట్ గుజరాత్’ పేరుతో పెట్టుబడుల కోసం ఆగస్టు 17 నుంచి 28 వరకు గుజరాత్ ముఖ్యమంత్రికి అమెరికా, కెనడా పర్యటనలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కానీ ‘తెలంగాణ రైజింగ్ 2047’లో భాగంగా తాము అమెరికా వెళ్లాలనుకుంటే ఎందుకు అడ్డుకుందో చెప్పాలన్నారు. నిజంగా తమ పర్యటనలో విషయం లేదనుకుంటే ఇంగ్లాండ్కు అనుమతి ఇచ్చి, అమెరికాకు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు.
Also Read : ఒత్తిడిలో తప్పు చేశా.. ఆ అమ్మాయి మంచిది… తప్పు ఒప్పుకున్న ఫోక్ డ్యాన్సర్ ..
మహాత్మా గాంధీ, అంబేడ్కర్ వంటి గొప్ప నాయకులు ఇంగ్లాండ్లో చదువుకుని దేశానికి దార్శనికులుగా మారారని, ఆర్థికంగా వెనుకబడిన మన విద్యార్థులకు కూడా అలాంటి విదేశీ విద్యావకాశాలను, క్రీడా సదుపాయాలను ఇక్కడికే తీసుకురావాలన్నది తమ ఆలోచన అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ ఇంకా ఒక గుజరాతీగానే వ్యవహరిస్తున్నారు తప్ప భారత ప్రధానిగా వ్యవహరించడం లేదన్నారు. గుజరాత్ అభివృద్ధికి ఇబ్బంది కలుగుతుందనే భయంతోనే తెలంగాణపై ఈ కుట్రకు తెరలేపిందన్నారు. ఇది రేవంత్ రెడ్డికి జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన తీవ్ర అన్యాయమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చూపుతున్న ఈ స్పష్టమైన వివక్ష ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో తమ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతారని తెలిపారు. “నా పర్యటనను అడ్డుకోవచ్చు కానీ, నా లక్ష్యాన్ని చేరుకోకుండా అడ్డుకోలేరు” అని సీఎం అన్నారను. అయితే ఇన్వెస్ట్ తెలంగాణ ఆధ్వర్యంలో డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026’ను ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు.









