HCU : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి కలకలం రేపింది. యూనివర్సిటీ క్యాంపస్‌లో గంజాయి విక్రయిస్తున్న ఒక పూర్వ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 10 గ్రాముల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read : నిజామాబాద్‌లో విషాదం : తీర్చలేని అప్పులతో తనువు చాలించిన దంపతులు!

పక్కా ముందస్తు సమాచారంతో ఈగల్ టీమ్ అధికారులు యూనివర్సిటీ ప్రాంగణంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలువురు విద్యార్థుల వద్ద గంజాయి లభించింది. దీంతో అనుమానితులైన విద్యార్థులకు డ్రగ్ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 17 మంది విద్యార్థులు గంజాయి సేవించినట్లుగా నిర్ధారణ అయింది.

పట్టుబడిన డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ గంజాయి విక్రయాలు అస్సాం రాష్ట్రం నుంచి సాగుతున్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. దీని వెనుక ఉన్న నెట్‌వర్క్ ను రాబట్టేందుకు పోలీసులు విచారణను వేగవంతం చేశారు.

Also Read : రాపిడో డ్రైవర్‌ను అంటూ యువతికి బురిడీ…. ఆమె ఇచ్చిన షాక్‌కు పరార్‌..

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.