Tamil Nadu CM Vijay : లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) కు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ తమిళనాడు అసెంబ్లీ కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు నూతన ముఖ్యమంత్రి విజయ్‌ డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో జరిగిన చర్చలో డీలిమిటేషన్‌కు తాము అంగీకరించేదే లేదని స్పష్టం చేయడం సంచలనంగ మారింది. కాగా, విజయ్‌ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుతున్న తమిళనాడు అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అసెంబ్లీలో తమిళనాడు ప్రభుత్వం వరుసగా సలే తీర్మానాలను ప్రవేశపెడుతోంది. ఇటీవల రాష్ర్ట గీతం, నీట్‌లపై తీర్మానం చేసిన అసెంబ్లీ ఈ రోజు డీలిమిటేషన్‌ పై తీర్మానం చేయడం గమనార్హం. ఈ సందర్భంగా నియోజకర్గాల పునర్‌ వ్యవస్థీకరణ కోసం కేంద్రం తీసుకువచ్చిన బిల్లును వ్యతిరేకిస్తున్నట్లు అసెంబ్లీ తీర్మానం చేసింది.

Also Read : రాజ్యసభలో లుంగీవాలా రచ్చ: దక్షిణాది ఎంపీల తీవ్ర నిరసన!

ఇక ఇదే సమవేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు తమిళనాడు అసెంబ్లీ మద్దతు ఇచ్చింది. లోకసభ విషయంలో ప్రస్తుతమున్న 543 సీట్లతోనే దానిని కొనసాగించాలని విజయ్ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కాగా, ఈ సందర్భంగా డీలిమిటేషన్‌కు తాము అంగీకరించేదే లేదని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. తమిళనాడు రాష్ర్టం జనాభా నియంత్రణకు అనేక చర్యలు తీసుకుందని,. దీంతో డీలిమిటేషన్‌ మూలంగా తమిళనాడుకు తీవ్ర నష్టం ప్రభుత్వం పేర్కొంది. జనాభా ఆధారంగా నియోజకవర్గ పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలన్ని తీవ్రంగా నష్టపోతాయని తమిళనాడు అసెంబ్లీ అభిప్రాయపడింది.

Also Read : ప్రేమించి పెళ్లి చేసుకుంటే నట్టేట ముంచింది.. బస్ కండక్టర్‌తో భార్య జంప్!

ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ మూడు డిమాండ్స్‌ను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. లోక్‌సభ సీట్ల సంఖ్యను 543 కే శాశ్వతంగా పరిమితం చేయాలని, రాష్ట్రాలకు ప్రస్తుతమున్న ఎంపీ సీట్ల సంఖ్యను కూడా శాశ్వతం చేయాలని కోరారు. రాష్ట్రాల అసెంబ్లీల్లో కూడా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

కాగా, ఇటీవల పశ్చిమబెంగాల్, మహారాష్ట్రల్లో జరిగిన ఎన్నికలతో పాటు, రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఎన్డీయే బలం మరింత పెరిగింది. దీంతో, కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును తెచ్చేందుకు మరోసారి ప్రయత్నిస్తుంది. అయితే, డీలిమిటేషన్‌ను దక్షిణాది రాష్ట్రాలు మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టడం సంచలనంగా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.