
Jim Corbett National Park : ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (Jim Corbett National Park) ప్రవేశ ద్వారమైన రామ్‌నగర్ (Ram Nagar)లో తీవ్ర కలకలం రేగింది. పర్యాటక రంగం (టూరిజం) ముసుగులో ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌లో సాగుతున్న భారీ సెక్స్ రాకెట్, రేవ్ పార్టీని పోలీసులు ఉమ్మడి ఆపరేషన్‌తో బట్టబయలు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) , రామ్‌నగర్ పోలీసులు అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన ఈ మెరుపు దాడులలో ఏకంగా 52 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో నరకం అనుభవిస్తున్న ఒక మైనర్ బాలికతో సహా మొత్తం 10 మంది మహిళలను అధికారులు సురక్షితంగా రక్షించారు.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రిసార్ట్ వేదికగా ఇతర రాష్ట్రాల నుండి, అలాగే విదేశాల నుండి సైతం అందమైన మహిళలను రప్పించి వ్యభిచార కూపాన్ని నడుపుతున్నారు. పోలీసులు ఈ లగ్జరీ రిసార్ట్‌పై దాడి చేసిన సమయంలో అక్కడ భారీ ఎత్తున ‘లిక్కర్ పార్టీ’ (మద్యం విందు) జరుగుతోంది. మద్యం మత్తులో మునిగిపోయిన విటులు, అక్కడ ఉన్న మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ, వారిపై విచ్చలవిడిగా నోట్ల వర్షం కురిపిస్తున్నట్లుగా పోలీసులు ప్రత్యక్షంగా గుర్తించారు. ఘటనా స్థలం నుండి పెద్ద మొత్తంలో లిక్విడ్ క్యాష్ (నగదు) తో పాటు పలు అభ్యంతరకర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read : కేటీఆర్ కన్నెపల్లి సందర్శనకు అడుగడుగున అడ్డంకులు… జాతీయ రహదారిపై హైడ్రామా
ఈ అశ్లీల నెట్‌వర్క్, రేవ్ పార్టీ వెనుక ఉన్న అసలు సూత్రధారిని ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ప్రముఖ పెస్టిసైడ్స్ (పురుగుల మందుల) వ్యాపారవేత్త ఉమేంద్ర కుమార్‌గా పోలీసులు గుర్తించారు. తన బిజినెస్ అసోసియేట్స్ (వ్యాపార భాగస్వాములు) ను ప్రసన్నం చేసుకోవడం కోసమే జూలై 4, 5 తేదీల్లో దాదాపు రూ. 2.20 లక్షల భారీ మొత్తాన్ని చెల్లించి ఈ లగ్జరీ రిసార్ట్‌ను అతను బుక్ చేసినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో అంగీకరించాడు. ఈ అసాంఘిక విందులో పాల్గొనేందుకు వచ్చిన ప్రతి మహిళకు రూ. 10 వేల చొప్పున రేటు ఫిక్స్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది.
ఈ దారుణ ఉదంతంలో సదరు రిసార్ట్ యాజమాన్యం, ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రిసార్ట్‌కు వచ్చే విటుల పేర్లను కానీ, తీసుకువచ్చే మహిళల పూర్తి వివరాలను కానీ విజిటర్స్ రిజిస్టర్‌లో ఎక్కడా నమోదు చేయవద్దని రిసార్ట్ జనరల్ మేనేజర్ స్వయంగా అక్కడి సిబ్బందిని ఆదేశించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ విధంగా చట్టం నుండి తప్పించుకోవడానికి, సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ పోలీసులు ఆ లగ్జరీ రిసార్ట్‌ను పూర్తిగా సీజ్ చేశారు.
ఈ సెక్స్ రాకెట్ ముఠాలో మైనర్ బాలిక సైతం చిక్కుకోవడంతో పోలీసులు ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. అరెస్టయిన 52 మంది నిందితులపై భారతీయ న్యాయ సంహిత (BNS) చట్టాల్లోని నిబంధనలతో పాటుగా, వ్యభిచార నిరోధక చట్టం, కఠినమైన పోక్సో (POCSO) చట్టం, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ప్రకృతి అందాలకు, ప్రశాంతతకు నిలయమైన జిమ్ కార్బెట్ ప్రాంతాన్ని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Also Read : రక్తమోడిన రోడ్లు…నలుగురు మృతి..పలువురికి గాయాలు









