Jio And Airtel Price Hike
Jio And Airtel Price Hike

ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్ తమ యూజర్లకు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలోనే రీఛార్జ్ ధరలను భారీగా పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరలు భారంగా మారనున్నాయి. ఈ సారి 15 శాతం వరకు ప్లాన్ల ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే పలుమార్లు రీఛార్జ్ ధరలను పెంచి యూజర్లకు షాక్ ఇచ్చిన ఈ కంపెనీలు.. ఇప్పుడు మరో పెంపు ఆలోచనతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

మార్కెట్ విశ్లేషకుల ప్రకారం.. జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు పెంచబోయే రీఛార్జ్ ధరలు మరో మూడు లేదా నాలుగు నెలల వ్యవధిలో అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ పెంపు కారణంగా ప్రతి నెల రూ.300 వరకు రీఛార్జ్ చేసుకునేవారికి అదనంగా మరో రూ.40 నుండి 50 వరకు భారం పడే అవకాశం ఉంది. ఇది గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివశించే సామాన్యులపై తీవ్ర ప్రభావం చూపనుంది.

Also Read : ప్రపంచ బ్యాంక్ తాజా ఆదాయ వర్గీకరణ …భారత్ కంటే శ్రీలంక గ్రేట్‌..మెరుగ్గా వియత్నం, ఫిలిప్పీన్స్..

కాగా ఈ సారి కంపెనీలు కొత్త వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నేరుగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడమే కాకుండా.. డేటా వాడకాన్ని బట్టి కూడా ఛార్జీలు వసూలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీని ప్రకారం.. తక్కువ డేటా వాడే వారికి ఒకరేటు, ఎక్కువ డేటా ఉపయోగించేవారికి మరొక రేటు ఉండనుంది. అయితే ఈ ధరల పెంపునకు సంబంధించి ఆయా కంపెనీల నుండి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు.

Also Read : మణిపూర్‌లో తీవ్రవాదుల ఘాతుకం: ఇద్దరు జవాన్లు మృతి!