

India GDP : జీడీపీ నెంబర్స్ వెనుక రియల్ స్టోరీ ఏమిటి? అంకెల గురించి ఒక సామెత ఉంది.. నంబర్లను టార్చర్ చేస్తే.. మనకు కావాల్సిన ఫలితాలు బయటకు వస్తాయని.! ఇప్పుడు జీడీపీ అంకెల విషయంలో కూడా అదే జరుగుతుందా? విపక్షం మాటల్లో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ప్రభుత్వం మాటల్లో అంతా సవ్యంగానే ఉంది. మరి నిజం ఏంటి? నిజం ఈ రెండింటి మధ్య ఎక్కడైనా దాగి ఉందా? ఏప్రిల్-జూన్ క్వార్టర్లీ జీడీపీ డేటా విడుదలతో అసలు వివాదం మొదలైంది. ఏడు పాయింట్ ఎనిమిది శాతం గ్రోత్ ఉందని ప్రభుత్వం సగర్వంగా ప్రకటించింది. ఫస్ట్ లుక్‌లో చూస్తే ఇది అద్భుతమైన నంబర్. ఎందుకంటే ఇదే సమయంలో ఇరాన్-అమెరికా యుద్ధం పీక్‌లో ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. బంగారం ధర పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ కూడా గ్రోత్ తగ్గొచ్చని… ఇన్ఫ్లేషన్ పెరగొచ్చని అంచనా వేసింది. ఇన్ఫ్లేషన్ పెరిగింది. కానీ గ్రోత్ తగ్గలేదు. ఇది కచ్చితంగా మంచి వార్తే. కానీ ఇక్కడే అసలు ప్రశ్న మొదలైంది.
జీడీపీ బేస్‌నే మార్చేశారని విమర్శకులు దాడి చేశారు. దీన్ని చాలా సింపుల్‌గా అర్థం చేసుకుందాం. జీడీపీ ఒక పిజ్జా అనుకోండి. గత ఏడాది పిజ్జా టెన్ ఇంచెస్ సైజులా ఉండేది. ఈ ఏడాది 12 ఇంచ్‌లు. కానీ ఇప్పుడు ఎవరో వచ్చి… గత ఏడాది పిజ్జా సైజు టెన్ ఇంచెస్ కాదు.. ఎయిట్ ఇంచెస్ అంటే? ఈ సంవత్సరం పెరుగుదల ఒక్కసారిగా చాలా ఎక్కువగా కనిపిస్తుంది కదా! అయితే ఇది కేవలం అర్థం చేసుకుంటూ చెప్పిన ఉదాహరణ. అసలు జీడీపీ లెక్కించడం చాలా సంక్షిష్టమైన విషయం. కానీ వివాదం మాత్రం ఇక్కడే ఉంది. గత సంవత్సరం ఇదే క్వార్టర్లో… పాత జీడీపీ సిరీస్ ప్రకారం నామినల్ జీడీపీ దాదాపు ఎనభై ఆరు లక్షల కోట్లు. కొత్త సిరీస్‌లో అదే కంపేరబుల్ ఫిగర్… దాదాపు ఎనభై లక్షల కోట్లకు వచ్చింది. ఈ సంవత్సరం… ఎనభై ఎనిమిది లక్షల కోట్లకు చేరింది.
మరి ఇప్పుడు విమర్శకుల వాదన ఏంటి? గత సంవత్సరం ఎనభై ఆరు లక్షల కోట్లుగా ఉండి ఉంటే ఈసారి గ్రోత్ చాలా తక్కువగా కనిపించేదని. అందుకే కొందరు… 2.6 శాతం గ్రోత్ అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. 2.6 శాతం అనేది ఇండియా అధికారిక నిజ జీడీపీ గ్రోత్ కాదు. ఎందుకంటే అక్కడ రెండు వేరు వేరు జీడీపీ సిరీస్‌ల నంబర్లను పోలుస్తున్నారు. ప్రభుత్వం ఏం చెప్తోంది? బేస్ మారిందని. మెథడాలజీ మారిందని. డేటా సోర్సులు మారాయని. అందుకే పాత నంబర్స్ కూడా రివైజ్ అయ్యాయి. అందుకే అసలు ప్రశ్న… 7.8 పర్సెంటా? లేక 2.6 పర్సెంటా అన్నది కాదు. అసలు ప్రశ్న… గత సంవత్సరం జీడీపీ ఫిగర్ 86 లక్షల కోట్ల నుంచి దాదాపు 80 లక్షల కోట్లకు ఎందుకు తగ్గింది? అంత పెద్ద రివిజన్ ఎందుకు జరిగింది? దానికి ప్రభుత్వం చెప్పే సమాధానం ఎంత నమ్మదగినదిగా ఉంది? ఇక్కడ నుంచే అసలు జీడీపీ కథ మొదలవుతుంది.
Also Read : కశ్మీర్ ఎన్కౌంటర్.. లష్కర్ కమాండర్ హతం
మరి ఇండియా ఎకానమీ నిజంగా 7.8 పర్సెంట్ గ్రో అవుతుందా? ఒక్క నిమిషం. 7.8 పర్సెంట్ నంబర్‌ను పక్కన పెడదాం. అది ఎక్కువగా చూపిస్తున్నారు అనుకుందాం. అయితే ఇండియా ఎకానమీ నిజంగా 2.5 లేదా 3 పర్సెంట్ మాత్రమే గ్రో అవుతుందా? అలా చెప్పలేం. ఎందుకంటే ఒక జీడీపీ నంబర్‌తో మొత్తం ఎకానమీని కొలవలేం. ఇంకొన్ని ఇండికేటర్స్ చూద్దాం. కార్లు, బైక్స్ అమ్మకాలు దాదాపు 21 పర్సెంట్ పెరిగాయి. పెట్రోల్ వినియోగం 6 పర్సెంట్ పెరిగింది. కరెంట్ వినియోగం 9 పర్సెంట్ పెరిగింది. సిమెంట్ ప్రొడక్షన్ 9 పర్సెంట్ పెరిగింది. స్టీల్ సేల్స్ 8 పర్సెంట్ పెరిగాయి. ఈవే బిల్స్ 12 పర్సెంట్ పెరిగాయి. ఇవన్నీ ఏం చెప్తున్నాయి? జనం ఎక్కువగా కార్లు కొంటున్నారు. బైక్స్ కొంటున్నారు. పెట్రోల్ ఎక్కువ వాడుతున్నారు.
కరెంట్ వినియోగం పెరుగుతుంది. స్టీల్, సిమెంట్ డిమాండ్ పెరుగుతోంది. అంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పెరుగుతోంది. ఈవే బిల్స్ పెరుగుతున్నాయి అంటే దేశంలో గుడ్స్ మూవ్మెంట్ పెరుగుతోంది. సింపుల్‌గా చెప్పాలంటే… ఎకానమీ వీల్స్ తిరుగుతున్నాయి. 7.8 పర్సెంట్ జీడీపీ కాల్క్యులేషన్పై ప్రశ్నలు ఉండొచ్చు. కానీ ఎకానమీ 2–3 పర్సెంట్ పెరుగుతుందని చెప్పటానికి ఇండికేటర్స్ మాత్రం సపోర్ట్ చేయడం లేదు. ఇక్కడ మరో పెద్ద ప్రశ్న ఉంది. ఈ గ్రోత్ సరిపోతుందా? ఎందుకంటే ఇండియా గ్రో అవుతుందనేది ఒక వాదన. ఇండియా కావాల్సినంత వేగంగా గ్రో అవుతుంది అనేది మరో వాదన. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 గురించి మాట్లాడుకుందాం. బ్లూమ్‌బర్గ్ అంచనా ప్రకారం డెవలప్డ్ కంట్రీ స్థాయికి వెళ్లాలంటే… మన పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా రెట్లు పెరగాలి. ఇప్పుడు మన పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు మూడు వేల డాలర్లు. దాన్ని దాదాపు పదిహేను వేల డాలర్లకు తీసుకెళ్లాలంటే… చాలా కాలం పాటు… 9 to 10 పర్సెంట్ గ్రోత్ కావాలి. కానీ గత రెండున్నర దశాబ్దాలుగా… మన గ్రోత్ ఎక్కువగా 6–7 పర్సెంట్ రేంజ్‌లోనే ఉంది.
అంటే… 2047 టార్గెట్ అంత ఈజీ కాదు. అందుకే జీడీపీ డిబేట్‌ను… కేవలం ఒక పొలిటికల్ ఫైట్‌గా చూడకూడదు. మనకి ఎప్పుడూ చెప్తుంటారు… ఇండియా ఫిఫ్త్ లార్గెస్ట్ ఎకానమీ అని. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీలో ఇండియా ఒకటి. ఇప్పుడు జీడీపీ గ్రోత్ 7.8 పర్సెంట్. అన్ని బానే ఉన్నాయి. కానీ… సామాన్యుల జీవితంలో మార్పు ఎంత వచ్చింది? అదే అసలు ప్రశ్న. జీడీపీ పెద్దదవుతుంది. కానీ… మనిషి ఆదాయం పెరుగుతుందా? మంచి ఉద్యోగాలు వస్తున్నాయా? కుటుంబం ఖర్చులు సులభంగా మేనేజ్ చేయగలుగుతుందా? ఎందుకంటే జీడీపీ అంటే ఒక ట్రోఫీ కాదు. జీడీపీ అంటే దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా నడుస్తుందో చెప్పే రిపోర్ట్ కార్డు. ఆ రిపోర్ట్ కార్డు ఎలా ఉండాలో… గ్రోత్ ఎంత ఉంది అన్నదే కాదు. ఆ గ్రోత్ వల్ల… ఎవరి జీవితాలు మారుతున్నాయి అన్నది ముఖ్యం. కాబట్టి ప్రశ్న… 7.8 పర్సెంట్ కరెక్టా కాదా అన్నది కాదు. అంతకంటే పెద్ద ప్రశ్న. ఈ గ్రోత్ ఎవరికి ఉపయోగపడుతుంది? ఎన్ని మంచి జాబ్స్ వస్తున్నాయి? ప్రజల ఇన్కమ్ నిజంగా పెరుగుతుందా? చివరిగా… 2047 నాటికి డెవలప్డ్ ఇండియా కావాలంటే… ఇదే గ్రోత్ సరిపోతుందా? ఎందుకంటే జీడీపీ కథ… ఒక నంబర్ కాదు. 140 కోట్ల భారతీయుల జీవితాల కథ.జీడీపీ నంబర్స్ వెనక రియల్ స్టోరీ ఏమిటి? ఇప్పుడు మొత్తం స్టోరీని ఒక్కసారి కలిపి చూద్దాం. ఒకవైపు ప్రభుత్వం చెప్తోంది. ఇండియా ఎకానమీ 7.8 పర్సెంట్ గ్రో అవుతోందని. ఇది చిన్న నంబర్ కాదు. అంచనాల కంటే చాలా ఎక్కువ. అంటే… 7.8 పర్సెంట్ అనేది బలమైన గ్రోత్ నంబర్. మరోవైపు… ఫార్మర్ ఫైనాన్స్ సెక్రటరీ సుబాస్ చంద్ర గార్గ్ సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఆయన ప్రశ్నేంటి? గత సంవత్సరం జీడీపీ బేస్ ఇంత పెద్దగా ఎందుకు రివైజ్ అయింది? అక్కడి నుంచే… 2.6 అనే కాల్యుక్యులేషన్ బయటకొచ్చింది. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్‌గా చెప్పాలి. 2.6 అనేది ఇండియా ఆఫిషియల్ రియల్ జీడీపీ గ్రోత్ కాదు. ఎందుకంటే… అక్కడ పాత జీడీపీ సిరీస్, కొత్త జీడీపీ సిరీస్ నంబర్స్‌ని కలిపి కంపేర్ చేస్తున్నారు. ప్రభుత్వం చెప్తోంది. “మేము నంబర్స్‌ని మానిపులేట్ చేయలేదని.” బేస్ ఇయర్ మారింది. మెథడాలజీ మారింది. కొత్త డేటా సోర్సెస్ వచ్చాయి. ప్రైస్ మెజర్మెంట్ కూడా మారింది. అందుకే పాత నంబర్స్ రివైజ్ అయ్యాయి అని ప్రభుత్వం వాదిస్తోంది. అంతేకాదు… జీడీపీ రివిజన్స్ ఎప్పుడూ కిందికి మాత్రమే జరగలేదు. కొన్ని సందర్భాల్లో… నంబర్స్ పైకి కూడా రివైజ్ అయ్యాయి. “ప్రభుత్వం కావాలనే పాత జీడీపీని తగ్గించి, కొత్త గ్రోత్‌ని ఎక్కువగా చూపించింది” అనేది ఆరోపణ. అయితే ఈ ఆరోపణ ఇప్పటిదాకా ప్రూవ్ కాలేదు. కానీ… అందుకని ప్రశ్నలు అడక్కుండా ఉండాలా? అడగాలి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలకు ఇంకా స్పష్టమైన సమాధానం కావాలి. రివిజన్ ఇంత పెద్దగా ఎందుకు జరిగింది? కొత్త మెథడాలజీ వల్ల ఏం మారింది? కొత్త డేటా వల్ల ఏం మారింది? కొత్త ప్రైస్ కాల్యుక్యులేషన్ వల్ల ఏం వచ్చింది? అన్నిటికంటే ముఖ్యంగా… ఈ 7.8 పర్సెంట్ గ్రోత్ సామాన్య జీవితంలో ఎంత కనిపిస్తోంది?
ఎందుకంటే జీడీపీ… ఒక గవర్నమెంట్ స్ప్రెడ్‌షీట్‌లో ఉన్న నంబర్‌గా మిగిలిపోకూడదు. దాని ఇంపాక్ట్ రియల్ లైఫ్‌లో కనిపించాలి. జాబ్స్‌లో కనిపించాలి. ఇన్కమ్స్లో కనిపించాలి. కన్సంప్షన్స్లో కనిపించాలి. అందుకే మొత్తం డిబేట్‌కి నా కన్‌క్లూజన్ చాలా సింపుల్. 7.8 పర్సెంట్ ఫేక్ అని చెప్పడం తప్పు. 2.6 పర్సెంట్ ఏ, అసలు జీడీపీ గ్రోత్ అని చెప్పడం కూడా తప్పు. కానీ… 7.8 పర్సెంట్పై ప్రశ్నలు అడగడం మాత్రం తప్పు కాదు. ఎందుకంటే డెమోక్రసీలో… నెంబర్స్ ఇవ్వటం ప్రభుత్వం పని. ఆ నెంబర్స్‌ని విశ్లేషించటం జర్నలిస్ట్ పని. ప్రభుత్వం వైపు నిలబడి చప్పట్లు కొట్టటం కాదు. విపక్షం వైపు నిలబడి అరవటం కూడా కాదు. ఒక్క ప్రశ్న అడగాలి. ఈ నెంబర్ వెనుక అసలు నిజం ఏంటి? అంకెలను టార్చర్ చేయకండి. ఏది ఉందో దాన్ని అంగీకరించండి. ఏది లేదో దాన్ని కూడా అంగీకరించండి. ఎందుకంటే జీడీపీ… కేవలం ఒక నెంబర్ కాదు. జీడీపీ అంటే… నూట నలభై కోట్ల జీవితాల ఆర్థిక రిపోర్ట్ కార్డ్. అందుకే చివరి ప్రశ్న అలాగే మిగులుతుంది. జీడీపీ నంబర్స్ వెనుక రియల్ స్టోరీ ఏంటి?
Also Read : BCCI సంచలనం.. 62 మంది క్రికెటర్లపై వేటు!









