Varanasi :  ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సంచలన ఆపరేషన్ నిర్వహించారు. చెత్‌గంజ్ ప్రాంతంలోని దాదా రెస్టారెంట్ వద్ద కాపు కాచిన అధికారులు, ఓ వ్యాపారి నుంచి రూ. 50 వేల లంచం తీసుకుంటుండగా జీఎస్టీ సెక్టార్-6 డిప్యూటీ కమిషనర్ అంబికా సింగ్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన కంపెనీకి సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రిటర్నులు, జీఎస్టీ అసెస్‌మెంట్‌ను పూర్తి చేసేందుకు అంబికా సింగ్ ఈ లంచాన్ని డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. ఈ సందర్భంగా అధికారులు లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. సాదా దుస్తుల్లో ఉన్న మహిళా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నప్పుడు, ఆమె తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు అక్కడ తీవ్ర కలకలం రేపాయి.

ఈ ఘటనకు సంబంధించి బాధితుడైన అజయ్ కుమార్ మౌర్య వారణాసిలోని బ్లాక్ స్మిత్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కంపెనీకి సంబంధించిన ఫిబ్రవరి 2023 రిటర్నులు, జీఎస్టీ అసెస్‌మెంట్‌కు సంబంధించి క్లారిఫికేషన్ ఇవ్వాలని డిప్యూటీ కమిషనర్ అంబికాను కోరగా, ఆమె పని పూర్తి చేయడానికి రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనితో విసిగిపోయిన వ్యాపారి, అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకుని వారణాసి విజిలెన్స్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

Also Read : అవినీతికి పాల్పడితే మంత్రినైనా తీసిపారేస్తా : సీఎం విజయ్ సంచలన ప్రకటన!

వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ బృందం మాస్టర్ ప్లాన్ వేసింది. ముందుగా అనుకున్నట్టుగానే లంచం డబ్బుతో చెత్‌గంజ్ ప్రాంతంలోని దాదా రెస్టారెంట్ వద్దకు వెళ్లాలని వ్యాపారికి సూచించారు. వ్యాపారి డబ్బు ఇస్తుండగా, అప్పటికే అక్కడ మాటు వేసిన విజిలెన్స్ బృందం ఒక్కసారిగా దాడి చేసి అంబికాను పట్టుకుంది. అప్పటివరకు అహంకారంతో ఉన్న ఆ అధికారిణి, తమను పట్టుకున్నది పోలీసులు అని తెలియగానే కంగారు పడిపోయారు. తనకున్న హోదాను, అధికారాన్ని చూపి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. చివరికి అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అయితే ఆమె అక్కడినుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా నలుగురు లేడీ కానిస్టేబుళ్లు పట్టుకున్నారు. నన్ను ఇరకించారు.. నేనం తప్పు చేయలేదు కాపాడండి అంటూ ఆమె ప్రాధేయపడ్డా స్థానికులు పట్టి్ంచుకోలేదు. ఈ భారీ అవినీతి ఘటన ఇప్పుడు వారణాసిలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : మోటో మావ కుమ్మేశాడు: కొత్త ఫోన్ లాంచ్.. రూ.5వేల భారీ డిస్కౌంట్..!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.