PhonePe :ఆధునిక కాలంలో ప్రతి పని సులభంగా చేసుకోవడానికి అలవాటుపడ్డాం. బ్యాంకుకు వెళ్లకుండానే చేతిలో ఉన్న మొబైల్‌లోనే లావాదేవీలు నిర్వహించుకుంటున్నాం. తాజాగా డిజిటల్‌ చెల్లింపుల ప్రొవైడర్‌ అయిన ఫోన్‌పే వినియోగదారులకు మరో కీలక సేవలు అందుబాటులోకి తెచ్చింది. తమ యాప్‌ లోనే సులభంగా ఎఫ్‌డీ చేసుకునే విధంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్ పంపిణీ వ్యాపారంలోకి ప్రవేశించింది. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల భాగస్వామ్యంతో తమ ఫోన్‌పే యాప్‌లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పోల్చిచూసుకుని.. సులభంగా డిపాజిట్‌ చేసుకునే ఎఫ్‌డీ మార్కెట్‌ప్లేస్‌ సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు శివాలిక్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌తో కలిసి డైలీ రికరింగ్‌ డిపాజిట్‌ (ఆర్‌డీ) సేవలను కూడా ప్రారంభించింది.

ఎఫ్‌డీ మార్కెట్‌ప్లేస్‌ కోసం ఫోన్‌పే యాప్‌లో ఉన్న మ్యూచువల్‌ ఫండ్స్, డిపాజిట్‌లో వినియోగదారులు ఎటువంటి పేపర్‌వర్క్‌ లేకుండానే 100% డిజిటల్‌ విధానంలో ఎఫ్‌డీలను బుక్‌ చేసుకోవడానికి వీలవుతుంది. రిజర్వ్‌బ్యాంక్‌ నిబంధనలను అనుసరించి రూ.5 లక్షల వరకు చేసే డిపాజిట్‌పై బీమా కూడా వర్తి్స్తుంది..

డైలీ రికరింగ్‌ డిపాజిట్‌ విషయానికి వస్తే వినియోగదారులు రోజుకు రూ.100 నుంచి రూ.1000 వరకు తమకు వద్ద ఎంత మొత్తం ఉంటే అంత పొదుపు చేయడానికి వీలుంది. యూపీఐ ఆటోపే సదుపాయం ద్వారా, ఆటోమేటిక్‌గా బ్యాంక్‌ ఖాతా నుంచి డబ్బు ఆర్‌డీలోకి మనం పొదుపు చేయాలనుకున్న మొత్తం జమ అవుతుంది. పెట్టుబడి పెట్టిన 7 రోజుల తర్వాత వినియోగదారులు తమ సొమ్మును ఎప్పుడైనా తిరిగి తీసుకోడానికి అవకాశం ఉంది. లేదా యూపీఐ ఆటోపే మ్యాండేట్‌ను నిలిపివేసుకునే సౌకర్యం ఉంది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.