
RAVI PRAKASH
E20 petrol : ఓ ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఇంటర్నల్‌గా చేసిన హెచ్చరిక ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. పెట్రోల్‌లో ఉండకూడని ఓ కలుషిత పదార్థం కారణంగా వాహనాలు చాలా వేగంగా దెబ్బతినే అవకాశం ఉందని కంపెనీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అంతేకాదు కొన్ని పరిస్థితుల్లో కేవలం 200 కిలోమీటర్లు ప్రయాణించినా ఇంజిన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో షాకింగ్ విషయం ఏంటంటే దేశంలోని 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పెట్రోల్ పంపుల నుంచి సేకరించిన ఫ్యూయల్ శాంపిల్స్‌లో కాలుష్య స్థాయిలు ఆందోళనకరంగా ఉన్నట్టు తేలింది. కొన్ని శాంపిల్స్‌లో క్లోరైడ్ స్థాయి ప్రభుత్వం నిర్దేశించిన పరిమితి కంటే దాదాపు 190 రెట్లు ఎక్కువగా ఉన్నట్టు రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్‌లో వెల్లడైంది. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి. ప్రభుత్వం నిర్దేశించిన క్లోరైడ్ పరిమితి 3 పార్ట్స్ పర్ మిలియన్ అంటే 3 పిపిఎమ్. కానీ ఒక సెట్ శాంపిల్స్‌లో ఇది ఏకంగా 570 పిపిఎమ్‌గా నమోదైనట్టు సమాచారం. అంతేకాదు కొన్ని శాంపిల్స్‌లో మాయిశ్చర్ (తేమ) స్థాయిలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన బెంచ్‌మార్క్ కంటే నాలుగు రెట్లకు పైగా ఉన్నట్టు తేలింది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ స్థాయి 13,000 పిపిఎమ్ వరకు వెళ్లినట్టు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అక్కడ బెంచ్‌మార్క్ మాత్రం 3,000 పిపిఎమ్. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఇది 12,500 పిపిఎమ్ వరకు నమోదైనట్టు సమాచారం.
మరి అసలు ప్రశ్న ఏంటి? భారత్‌లోని ఈ20 పెట్రోల్‌లో అసలు ఏం జరుగుతోంది? సమస్య ఈ20 వల్లా? లేక ఫ్యూయల్ కాంటామినేషన్ వల్లా? లేదా ఫ్యూయల్ స్టోరేజ్, పైప్‌లైన్లలో ఏమైనా సమస్య ఉందా? లేక సాధారణ వాహనదారుడికి తెలియని ఇంకేదైనా పెద్ద విషయం ఉందా? అసలు విషయం ఇది. ఇవి వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న ఫిగర్స్ కాదు. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు కూడా కాదు. ఈ వివరాలన్నీ ప్రపంచంలోని ప్రముఖ న్యూస్ ఏజెన్సీలలో ఒకటైన రాయిటర్స్ చేసిన ఇన్వెస్టిగేషన్‌లో బయటకు వచ్చాయి. రాయిటర్స్ వెల్లడించినదాని ప్రకారం భారత్‌లోని కొన్ని పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు, అలాగే దేశంలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ మధ్య జరిగిన ఇంటర్నల్ కమ్యూనికేషన్, ఈమెయిల్స్‌ను పరిశీలించింది.
ఆ ఈమెయిల్స్‌లో బయటపడిన విషయాలు ఈ20పై జరుగుతున్న మొత్తం డిబేట్‌నే మరో కోణంలో చూసేలా చేస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు మాత్రం బయటకు మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతూ వచ్చాయి. కానీ రాయిటర్స్ పరిశీలించిన ఇంటర్నల్ కమ్యూనికేషన్‌లో మాత్రం ఆటోమొబైల్ తయారీదారులు క్లోరైడ్, మాయిశ్చర్, అలాగే వాహనాలకు జరిగే సాధ్యమయ్యే డ్యామేజ్‌పై ప్రైవేట్‌గా చర్చించినట్టు తెలుస్తోంది. అందుకే ఈసారి పాలిటిక్స్‌ను కాసేపు పక్కన పెడదాం. డాక్యుమెంట్స్ ఏం చెబుతున్నాయో చూద్దాం. ఈ20 గురించి ఆటోమొబైల్ కంపెనీలకు అసలు ఏం తెలుసు? వాళ్లు ఒకరితో ఒకరు ప్రైవేట్‌గా ఏం మాట్లాడుకున్నారు? ఇండస్ట్రీ బాడీ మొదట ప్రభుత్వాన్ని ఎందుకు అలర్ట్ చేసింది? ఆ వార్నింగ్‌ను తర్వాత ఎందుకు విత్‌డ్రా చేసింది? మరి ప్రభుత్వం మాత్రం దీనిపై పూర్తిగా భిన్నమైన పిక్చర్ ఎందుకు ఇస్తోంది? ఇదే మీరు తెలుసుకోవాల్సిన అసలు ఈ20 స్టోరీ.
ఇప్పుడు రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్‌లో అసలు ఏం బయటపడిందో చూద్దాం. ముందుగా ఒక విషయం క్లియర్‌గా చెప్పాలి. భారత్‌లో ఈ20 వాడుతున్న ప్రతి వాహనం తప్పకుండా పాడైపోతుందని రాయిటర్స్ చెప్పడం లేదు. రాయిటర్స్ చెబుతున్నది మరింత స్పెసిఫిక్ విషయం. ఈ20 పెట్రోల్ కలుషితం గురించి ఆటోమొబైల్ కంపెనీల్లోనే ఆందోళన పెరుగుతోంది. రాయిటర్స్ రిపోర్టర్లు అదితి షా, ఆధిత్య కల్రా… భారత్‌లోని కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు, అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ మధ్య జరిగిన ఇంటర్నల్ కమ్యూనికేషన్స్‌ను పరిశీలించారు. ఈ డిస్కషన్స్‌లో మారుతి సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఉన్నాయి. రాయిటర్స్ ప్రకారం… ఈ మూడు కంపెనీలు కలిపి భారత్‌లోని కార్ మార్కెట్‌లో దాదాపు 67 శాతం వాటా కలిగి ఉన్నాయి.
మరి వాళ్లు ఏం చర్చించారు? ఈ20 పెట్రోల్ కలుషితం గురించి. ముఖ్యంగా రెండు విషయాలపై క్లోరైడ్, మాయిశ్చర్. కల్తీ గురించి! రాయిటర్స్ పరిశీలించిన ఇంటర్నల్ ఇండస్ట్రీ డేటా ప్రకారం దాదాపు ఏడాది కాలంలో పెట్రోల్ పంపుల నుంచి 250కి పైగా ఫ్యూయల్ శాంపిల్స్ సేకరించారు. ఈ శాంపిల్స్… 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చినట్టు సమాచారం. ఇందులో 18 రాష్ట్రాల్లో క్లోరైడ్ కాంటామినేషన్ ఎక్కువగా ఉన్నట్టు ఇండస్ట్రీ డేటాలో కనిపించింది. మరి క్లోరైడ్ ఎందుకు అంత ఇంపార్టెంట్? ప్రభుత్వం నిర్దేశించిన అనుమతించదగిన పరిమితి 3 పిపిఎమ్.. అంటే 3 పార్ట్స్ పర్ మిలియన్. కానీ రాయిటర్స్ పరిశీలించిన డేటాలో కొన్ని శాంపిల్స్‌లో దీనికంటే చాలా ఎక్కువ లెవెల్స్‌లో నమోదయ్యాయి.
రాజస్థాన్‌లో 6 నుంచి 570 పిపిఎమ్ వరకు… ఢిల్లీలో 1.4 నుంచి 420 పిపిఎమ్ వరకు… మహారాష్ట్రలో 10 నుంచి 357 పిపిఎమ్ వరకు క్లోరైడ్ ఉన్నట్టు డేటాలో నమోదైంది. ఇది చిన్న వేరియేషన్ కాదు. ఇంకో సమస్య కూడా బయటపడింది. ఫ్యూయల్‌లో నీరు కలవడం. ఆంధ్రప్రదేశ్‌లో మాయిశ్చర్ లెవెల్ 13,000 పిపిఎమ్ వరకు ఉత్తరప్రదేశ్‌లో 12,500 పిపిఎమ్ వరకు వెళ్లినట్టు రాయిటర్స్ నివేదిక చెబుతోంది.
అక్కడ గవర్నమెంట్ బెంచ్‌మార్క్ మాత్రం 3,000 పిపిఎమ్. అయితే ఇక్కడ ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ రాయిటర్స్ పరిశీలించిన ఇండస్ట్రీ టెస్టింగ్ రిజల్ట్స్. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం ఈ20 ఫ్యూయల్ కలుషితమైందని ప్రభుత్వం అధికారికంగా సర్టిఫై చేసిన ఫైండింగ్స్ మాత్రం కావు!. అదే సమయంలో… ప్రభుత్వం, ఆయిల్ కంపెనీలు మాత్రం దీనిపై మరో విధమైన పిక్చర్‌ను ఇస్తున్నాయి. అది తర్వాత చూద్దాం. ముందుగా… ఆటోమొబైల్ కంపెనీలు తమ ఇంటర్నల్ ఈమెయిల్స్‌లో ఏం చెప్పాయో చూద్దాం.
రాయిటర్స్ ప్రకారం… జులై 26న మారుతి ఎగ్జిక్యూటివ్ అనూప్ భట్ ఒక ఇంటర్నల్ ఈమెయిల్‌లో ప్రస్తుతం వాహనాల్లోని ఫ్యూయల్ ఇంజెక్టర్లు తట్టుకోగల క్లోరైడ్ స్థాయి గరిష్ఠంగా 1 పిపిఎమ్ అని రాశారు. ఈ20లో 1 పిపిఎమ్ కంటే తక్కువ క్లోరైడ్ ఉండటం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు అనుగుణంగా ఉంటుందని కూడా అనూప్ భట్ పేర్కొన్నారు. అలాగే పెట్రోలియం మినిస్ట్రీతో జరిగిన డిస్కషన్స్‌ను కూడా అనూప్ ప్రస్తావించినట్టు రాయిటర్స్ తెలిపింది.
ఇక మహీంద్రా ఈమెయిల్ విషయానికి వస్తే… మహీంద్రా సీనియర్ ప్రిన్సిపల్ ఇంజనీర్ ఆఫ్ ఫ్లూయిడ్స్ టెక్నాలజీ ఆర్. రమాప్రభు… ఇండస్ట్రీలో కనిపిస్తున్న చాలా వేగంగా జరుగుతున్న వెహికల్ ఫెయిల్యూర్స్‌కు ఆర్గానిక్ క్లోరైడ్ కారణమవుతోందని రాసినట్టు రాయిటర్స్ తెలిపింది. అందులో ఒక లైన్ ఇప్పుడు ఈ మొత్తం కాంట్రోవర్సీలోనే అత్యంత షాకింగ్‌గా మారింది. “ఆర్గానిక్ క్లోరైడ్ వల్ల కేవలం 200 కిలోమీటర్లలోనే ఇంజిన్లు పాడైపోవచ్చు అంటే… ఆర్గానిక్ క్లోరైడ్ కారణంగా కేవలం 200 కిలోమీటర్లలోనే ఇంజిన్ దెబ్బతినే అవకాశం ఉందని రమాప్రభు పేర్కొన్నట్టు రాయిటర్స్ తెలిపింది. అంతేకాదు… ఫ్యూయల్ నింపిన వెంటనే కనిపించిన చాలా వెహికల్ ఫెయిల్యూర్ కేసులకు ఆర్గానిక్ క్లోరైడ్ కారణమని కూడా రమాప్రభు రాసినట్టు రాయిటర్స్ చెబుతోంది.రిటైల్ అవుట్‌లెట్స్ నుంచి సేకరించిన ఫ్యూయల్ శాంపిల్స్ ఆధారంగా తమ దగ్గర దీనికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయని కూడా రమాప్రభు పేర్కొన్నట్టు సమాచారం. అయితే… మహీంద్రా మాత్రం ఈ ఈమెయిల్స్‌ను రాయిటర్స్ అర్థం చేసుకున్న విధానాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.
తమ ఎగ్జిక్యూటివ్ ఈమెయిల్స్ ఆధారంగా తీసుకున్న నిర్ణయాలు “పూర్తిగా బేస్‌లెస్ మరియు ఇన్‌కరెక్ట్” అని రాయిటర్స్‌కు మహీంద్రా తెలిపింది. అలాగే ఇండస్ట్రీ డేటా కూడా పరిమితమైనది మరియు ప్రాథమికమైనది మాత్రమేనని చెప్పింది. మారుతి, టాటా మోటార్స్ మాత్రం రాయిటర్స్ అడిగిన ప్రశ్నలకు స్పందించలేదు. అందుకే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రధానంగా ఈ20లో కాంటామినేషన్ గురించి.
ఈ20 వల్లే అన్ని వాహనాల ఇంజిన్లు తప్పకుండా డ్యామేజ్ అవుతాయని చెప్పడానికి ఇది ప్రూఫ్ కాదు. ఈ తేడా మొత్తం స్టోరీలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే… సమస్య కాంటామినేషన్ అయితే… మరి అసలు ఆ కాంటామినేషన్ ఎక్కడి నుంచి వస్తోంది? ఈ20 తయారయ్యే సమయంలోనే కాంటామినేషన్ జరుగుతోందా? ఫ్యూయల్ ట్రాన్స్‌పోర్టేషన్‌లోకి కాంటామినేషన్ వస్తోందా? లేక పెట్రోల్ పంపుల్లోని అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకులు, పైప్‌లైన్ల నుంచి ఫ్యూయల్‌లోకి కలుస్తోందా? లేదా దీనికి ఇంకేదైనా రీజన్ ఉందా? ఇక్కడే ఈ స్టోరీ మరో డ్రమాటిక్ టర్న్ తీసుకుంటుంది. ఎందుకంటే… ఈ కాంటామినేషన్‌పై ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఇప్పటికే ప్రభుత్వాన్ని అలర్ట్ చేసింది.
ఇప్పుడు రాయిటర్స్ ఇన్వెస్టిగేషలోనే అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాం. ఎందుకంటే… ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాయి. రాయిటర్స్ పరిశీలించిన ఇంటర్నల్ ఈమెయిల్స్ ప్రకారం… జులై 26న మారుతి ఎగ్జిక్యూటివ్ అనూప్ భట్… ఫ్యూయల్‌లో క్లోరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న విషయం పెట్రోలియం మినిస్ట్రీతో చర్చించినట్టు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజులకే… జులై 28న ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాడీ ‘సియామ్’ ప్రభుత్వానికి ఓ లెటర్ పంపింది.సియామ్ పంపిన లెటర్‌లో… ఫ్యూయల్‌లో పెరుగుతున్న క్లోరైడ్ లెవెల్స్‌పై ఆందోళన వ్యక్తం చేసినట్టు రాయిటర్స్ తెలిపింది.
అంతేకాదు… ఈ కాంటామినేషన్‌కు అసలు కారణమేంటో ఇన్వెస్టిగేట్ చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించాలని ప్రభుత్వాన్ని కోరింది. ఫ్యూయల్‌లో మాయిశ్చర్ ఉండటంపై కూడా సియామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మాయిశ్చర్‌కు కారణం… పెట్రోల్ పంపుల్లోని అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకులు, పైప్‌లైన్లను సరిగ్గా మెయింటెన్ చేయకపోవడం కావచ్చని లెటర్‌లో పేర్కొన్నట్టు సమాచారం. సింపుల్‌గా చెప్పాలంటే… ఫ్యూయల్, పెట్రోల్ పంప్‌కు చేరిన దగ్గర నుంచి… మన కార్‌లోకి వెళ్లే వరకు ఎక్కడో ఏదో ప్రాబ్లమ్ ఉండొచ్చని ఇండస్ట్రీ అనుమానించింది. కానీ… ఆ తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
కొన్ని రోజుల్లోనే సియామ్ తన వార్నింగ్ లెటర్‌ను వెనక్కి తీసుకుంది. ఎందుకు? ఆ డేటాలోని కొన్ని లెక్కలను ఇంకా వెరిఫై చేయాల్సి ఉందని సియామ్ చెప్పింది. అలాగే… టెస్టింగ్ ఎలా జరిగింది, శాంపిల్ సైజ్ ఎంత ఉంది అనే దానిపై స్పష్టమైన ముగింపునకు రావడానికి సరిపడా డేటా లేదని తెలిపింది. ఆ లెటర్ పొరపాటున పంపినట్టు కూడా సియామ్ వెల్లడించింది. ఇప్పుడు సియామ్… ఈ విషయంపై సరియైన సైంటిఫిక్ స్టడీ చేయాలని చెబుతోంది. కానీ… ఇక్కడే రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్‌లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కనిపిస్తుంది. రాయిటర్స్ పరిశీలించిన ఇంటర్నల్ ఈమెయిల్స్ చూస్తే… డేటా విషయంలో ఇంత అనిశ్చితి ఉన్నట్టు కనిపించడం లేదు.
ఎందుకంటే ఆటోమొబైల్ కంపెనీలు అప్పటికే తమ ఫైండింగ్స్‌ను ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నాయి. 250కి పైగా ఫ్యూయల్ శాంపిల్స్. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి శాంపిల్స్. 18 రాష్ట్రాల్లో హై క్లోరైడ్ లెవెల్స్. అదీ ఒక్క కంపెనీ డేటా కాదు. మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా… ఈ మూడు కంపెనీలు కూడా ఈ ఇంటర్నల్ డిస్కషన్స్‌లో ఉన్నాయి. రాయిటర్స్ ప్రకారం… ఈ మూడు కంపెనీలు కలిపి భారత్‌లోని కార్ మార్కెట్‌లో దాదాపు 67 శాతం వాటా కలిగి ఉన్నాయి. మరి ఇక్కడ సహజంగానే ఓ ప్రశ్న వస్తుంది. ఇండస్ట్రీ మొదట వార్నింగ్ ఇచ్చి… ఆ తర్వాత ఎందుకు వెనక్కి తగ్గింది? డేటా నిజంగానే రిలయబుల్‌గా లేదా? శాంపిల్ సైజ్ సరిపోలేదా? లేక వార్నింగ్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్, పబ్లిక్ నుంచి వచ్చిన రియాక్షన్‌తో ఇండస్ట్రీ వెనక్కి తగ్గిందా? ఈ విషయంలో క్లారిటీ లేదు. అందుకే… ఇక్కడే ఒక ప్రాపర్, ఇండిపెండెంట్ సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అవసరం మరింత పెరుగుతోంది. కానీ… ఈ స్టోరీలో మరో సైడ్ కూడా ఉంది. ఆటోమొబైల్ కంపెనీలు ఇంటర్నల్‌గా కాంటామినేషన్‌పై డిస్కస్ చేస్తున్న సమయంలో… గవర్నమెంట్, ఆయిల్ కంపెనీలు మాత్రం పూర్తిగా భిన్నమైన పిక్చర్‌ను ఇచ్చాయి.
పెట్రోలియం మినిస్టర్ హర్‌దీప్ సింగ్ పూరి చెప్పిన ప్రకారం… సియామ్ లెటర్ అందకముందే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్యూయల్‌పై రిగరస్ టెస్టింగ్ ప్రారంభించాయి. గవర్నమెంట్ వెర్షన్ ప్రకారం… వాళ్లకు కేవలం నాలుగు కాంటామినేషన్ కేసెస్ మాత్రమే కనిపించాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ఇండియన్ ఆయిల్, బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్ కూడా… తాము చేసిన విస్తృతమైన టెస్టింగ్‌లో ఆందోళన చెందాల్సిన కారణాలు ఏవీ కనిపించలేదని చెప్పాయి. వాళ్ల ప్రకారం… రిఫైనరీల నుంచి సేకరించిన 100కి పైగా పెట్రోల్ శాంపిల్స్‌లో క్లోరైడ్ లెవెల్స్ 1 పిపిఎమ్ లేదా అంతకంటే తక్కువగా ఉన్నాయి. అంతేకాదు… 80 డిస్టిలరీల నుంచి ఇథనాల్‌ను టెస్ట్ చేశారు. 80కి పైగా డిపోలు, టెర్మినల్స్ నుంచి ఈ20 శాంపిల్స్‌ను కూడా పరీక్షించారు.
అదే విధంగా… సుమారు 90,000 ఫ్యూయల్ స్టేషన్లలో ఇన్‌స్పెక్షన్లు నిర్వహించామని… అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకుల్లోకి నీరు చేరినట్టు ఎక్కడా కనిపించలేదని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. మరి ఇప్పుడు మన ముందు ఒక ఇంట్రెస్టింగ్ వైరుధ్యం ఉంది. ఒకవైపు… ఆటోమేకర్స్ టెస్ట్ చేసిన 250కి పైగా శాంపిల్స్‌లో… పలు రాష్ట్రాల్లో అధిక కాంటామినేషన్ లెవెల్స్ నమోదయ్యాయి. మరోవైపు… గవర్నమెంట్, ఆయిల్ కంపెనీలు మాత్రం… దేశవ్యాప్తంగా చేసిన టెస్టింగ్‌లో ఎలాంటి ఆందోళనకర కారణాలు కనిపించలేదని చెబుతున్నాయి.
మరి ఇక్కడే ఈ మొత్తం కాంట్రోవర్సీలో అత్యంత ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ రెండు వైపుల టెస్ట్‌లు ఒకే రకమైన శాంపిల్స్‌తోనే జరిగాయా? ఎందుకంటే… ఒక సెట్ ఆఫ్ టెస్ట్స్‌లో కాంటామినేషన్ లెవెల్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంటే… మరో దేశవ్యాప్త టెస్టింగ్‌లో దాదాపు ఏమీ కనిపించకపోతే… ఈ ఫలితాలు ఇంత తీవ్రంగా భిన్నంగా ఎందుకు ఉన్నాయో ఎవరో ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అక్కడితో ఈ ఈ20 కాంట్రోవర్సీ… కేవలం మైలేజ్ లేదా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ గురించి మాత్రమే కాదు. ఇది ఇప్పుడు… ఫ్యూయల్ క్వాలిటీ… టెస్టింగ్ మెథడాలజీ… బాధ్యతాయుతత్వం, వినియోగదారుల భద్రతకు సంబంధించిన క్వశ్చన్‌గా మారింది. ఇంకో ప్రశ్నను కూడా మనం ఇగ్నోర్ చేయలేం. అసలు సమస్య ఈ20 వల్లేనా? లేక… సప్లై చైన్‌లో ఎక్కడో కంటామినేషన్ ఈ20లోకి చేరుతోందా? ఈ రెండింటి మధ్య ఉన్న తేడా… ఈ20పై జరుగుతున్న మొత్తం డిబేట్‌నే మార్చేయగలదు.
అసలు సమస్య ఈ20 పెట్రోల్ వల్లా? లేక… ఫ్యూయల్‌లో కాంటామినేషన్ వల్లా? ఎందుకంటే… ఈ రెండు వేర్వేరు విషయాలు. రాయిటర్స్ కూడా ఈ20 వాడుతున్న ప్రతి వెహికల్ పాడైపోతుందని చెప్పడం లేదు. రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్‌లో బయటపడింది ఏంటంటే… ఆటోమొబైల్ కంపెనీలు ఈ20 ఫ్యూయల్‌లో క్లోరైడ్, మాయిశ్చర్ కాంటామినేషన్‌పై ఇంటర్నల్‌గా చర్చించాయి. వాళ్లు సేకరించిన డేటాలో… పలు రాష్ట్రాల్లోని శాంపిల్స్‌లో చాలా ఎక్కువ కాంటామినేషన్ లెవెల్స్ కనిపించినట్టు తెలుస్తోంది. అదే సమయంలో… గవర్నమెంట్, ఆయిల్ కంపెనీలు మాత్రం… తాము చేసిన విస్తృతమైన టెస్టింగ్‌లో రీజన్స్ ఏవీ కనిపించలేదని చెబుతున్నాయి. ఇక సియామ్… మొదటగా ప్రభుత్వాన్ని అలర్ట్ చేసి… ఆ తర్వాత తన లెటర్‌ను వెనక్కి తీసుకుని… డేటాను ఇంకా వెరిఫై చేయాల్సి ఉందని చెప్పింది. అంటే… ఇప్పుడు మన ముందు రెండు రకాల డేటా… రెండు రకాల వాదనలు ఉన్నాయి. అందుకే ఈ ఇష్యూను ఇంత ఈజీగా పక్కన పెట్టేయలేం. గవర్నమెంట్ పూర్తి టెస్టింగ్ డిటైల్స్ బయటపెట్టాలి. శాంపిల్స్ ఎక్కడ సేకరించారు? ఎన్ని శాంపిల్స్‌ను టెస్ట్ చేశారు? ఏ లాబొరేటరీ స్టాండర్డ్స్‌ను ఉపయోగించారు? క్లోరైడ్, మాయిశ్చర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? ఇండస్ట్రీ టెస్టింగ్ రిజల్ట్స్, గవర్నమెంట్ టెస్టింగ్ రిజల్ట్స్ ఇంత భిన్నంగా ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ గవర్నమెంట్ క్లియర్‌గా చెప్పాలి. ఎందుకంటే… ఈ మొత్తం కాంట్రోవర్సీ మధ్యలో ఉన్నది… మారుతి కాదు. మహీంద్రా కాదు. టాటా కాదు. సియామ్ కాదు. గవర్నమెంట్ కూడా కాదు. అది… సామాన్య వాహనదారుడు.
ఇప్పటికే కోట్లాది మంది ఈ20 పెట్రోల్ వాడుతున్నారు. వాళ్లను… పార్ట్స్ పర్ మిలియన్, ఆర్గానిక్ క్లోరైడ్, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, అండర్‌గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంకులు లాంటి టెక్నికల్ విషయాలు అర్థం చేసుకోమని అడగలేం. వాళ్లకు కావాల్సింది ఒక్క సింపుల్ ఆన్సర్. నా కారులో పోస్తున్న ఫ్యూయల్ ప్యూర్‌గా ఉందా లేదా? సేఫా కాదా? అంతే. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. కాంటామినేషన్ నే సమస్య అయితే… వెంటనే ఈ20నే బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అసలు ప్రశ్న… ఫ్యూయల్‌లోకి ఆ కాంటామినేషన్ ఎక్కడి నుంచి వస్తోంది? రిఫైనరీలోనా? ట్రాన్స్‌పోర్టేషన్‌లోనా? డిపోలోనా? లేక పెట్రోల్ పంప్ దగ్గరా? ఎందుకంటే… ఆ మొత్తం సప్లై చైన్‌లో ఎక్కడైనా గవర్నమెంట్ స్టాండర్డ్స్ ఉల్లంఘన జరుగుతుంటే… దానికి బాధ్యులు ఎవరో తేలాలి. అదే సమయంలో… ఇండస్ట్రీ ఇచ్చిన ప్రిలిమినరీ డేటా తప్పు అయితే… అది కూడా సైంటిఫిక్ టెస్టింగ్ ద్వారా తేలాలి. పాలిటిక్స్ వద్దు. ప్రొపగండా వద్దు. వాట్సాప్ ఫార్వర్డ్స్ వద్దు.
కావాల్సింది ఒక్కటే… ఇండిపెండెంట్ టెస్టింగ్. కంప్లీట్ ట్రాన్స్‌పరెన్సీ. ఎందుకంటే రాయిటర్స్ ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్ క్వశ్చన్‌ను ముందుకు తెచ్చింది. ఈ20 ఫ్యూయల్‌లో కాంటామినేషన్ గురించి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఏం తెలుసు? అది వాళ్లకు ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు… దేశానికి ప్రభుత్వం నుంచి కూడా అంతే క్లియర్‌గా ఓ ఆన్సర్ కావాలి. భారత్‌లో ఈ20 ఇంధనం నిజంగా సురక్షితమేనా? పూర్తి వివరాలు బయటపెట్టండి.









