Ration ATM :ఇప్పటివరకు మనకు డబ్బులిచ్చే ఏటీఎంలు మాత్రమే తెలుసు. కానీ, ఇపుడు బియ్యం ఇచ్చే ఏటీఎంలు కూడా అందుబాటులోకి వచ్చాయి. రేషన్‌ షాపుల్లో బియ్యం కోసం గంటల తరబడి క్యూకట్టాల్సిన అవసరం లేకుండా రేషన్‌ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏటీఎం లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అంటే  ఏ సమయంలోనైనా రేషన్ బియ్యం సరఫరా చేసే ఏటీఎం మెషీన్  అందుబాటులోకి వచ్చిందన్నమాట. ఏటీఎం మిషన్లో ఏటీఎం కార్డు పెట్టి పిన్ నంబర్ ఎంటర్ చేసినట్లు..రేషన్ ఏటీఎంలో కూడా మన రేషన్‌  కార్డు వివరాలు ఎంటర్ చేస్తే చాలు.. మీ కోటా బియ్యం ఎంతో అవి మనం సంచి పెట్టగానే అందులో వచ్చి పడతాయి. అయితే ఇది అందుబాటులోకి వచ్చింది మాత్రం మన రాష్ర్టంలో కాదు.  ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. 24 గంటలు సేవలు అందించే రేషన్ ఏటీఎం ద్వారా మనకు వీలయిన సమయంలో బియ్యం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

   
ఇక మీదట రేషన్ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ 24 గంటల  రేషన్ ఏటీఎంను ఉపయోగించుకుంటే చాలు. ఈ మెషీన్ లో సుమారు 2వేల500 కిలోల బియ్యం నిల్వ చేయడానికి అవకాశం ఉంది.  బియ్యాన్ని మెషీన్ లో నింపడం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేయడం వరకు అంతా కూడా  ఆటోమేటిక్‌గా జరుగుతుంది.లబ్ధిదారులు తమకు కేటాయించిన రేషన్‌ను సులభంగా పొందేలా ఈ విధానాన్ని ఆరంభించారు. దీంతో రేషన్ దుకాణాల దగ్గర రద్దీ తగ్గడంతో పాటు, సమయం కూడా ఆదా అయ్యే అవకాశం ఉందని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.