BSNL fathars day offers 2026
BSNL fathars day offers 2026

ప్రముఖ టెలికాం సంస్థలు యూజర్లను ఆకట్టుకునేందుకు రకరకాల రీఛార్జ్ ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే జియో, ఎయిర్‌టెల్ వంటి దిగ్గజ కంపెనీలు కొద్ది రోజులుగా టారిఫ్ ధరలను పెంచుతూ యూజర్లపై భారం మోపుతున్న సంగతి తెలిసిందే. అదే సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం వినియోగదారులను అట్రాక్ట్ చేసేందుకు తక్కువ ధరలోనే ప్లాన్‌లను అందిస్తుంది.

ఇటీవల BSNL మరో అద్భుతమైన ప్లాన్‌లో ఎక్స్‌ట్రా డేటాను కూడా అందించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఫాదర్స్ డే 2026 సందర్భంగా కొత్త ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అయితే ఈ ఆఫర్ కొంత కాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ పేర్కొంది. జూన్ 21న ప్రారంభమైన ఈ ఆఫర్ జూన్ 30వ తేదీ వరకు వ్యాలిడిటీని కలిగి ఉంది. #RechargeForPapa అనే సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా కంపెనీ ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.

BSNL fathars day offers 2026

BSNL ప్లాన్స్: కంపెనీ రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లను అందుబాటులోకి తెచ్చింది. అందులో రూ.997 ప్లాన్, రూ.1999 ప్లాన్‌లు ఉన్నాయి.

BSNL రూ.997 ప్లాన్: వినియోగదారులు రూ.997లతో రీఛార్జ్ చేసుకుంటే 150 రోజుల పాటు వ్యాలిడిటీని పొందుతారు. అలాగే అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2జీబీ డేటా, డైలీ 100 SMS లు లభిస్తాయి. దీనికి తోడు ఫాదర్స్ డే ఆఫర్‌లో భాగంగా 5 జీబీ ఎక్స్‌ట్రా డేటా కూడా వస్తుంది.

BSNL రూ.1999 ప్లాన్: యూజర్లు రూ.1999 ప్లాన్‌లో 330 రోజుల భారీ వ్యాలిడిటీని అందుకుంటారు. అలాగే ఇందులో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5 జీబీ డేటా, డైలీ 100 SMSలు పొందచ్చు. ఇందులో 10 జీబీ ఎక్స్ ట్రా డేటా లభిస్తుంది. ఆఫర్ కాలపరిమితిలోపు రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే ఈ ఎక్స్‌ట్రా బోనస్ అందుబాటులో ఉంటుంది.

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.