
Airtel Recharge : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యూజర్లకు ఇది నిజంగా దిమ్మతిరిగే షాక్ అనే చెప్పాలి. ఇప్పటివరకు బాగా పాపులర్ అయిన 28 రోజుల వ్యాలిడితో ఉన్న రూ.299 ప్లాన్ ను క్లోజ్ చేసింది. తక్కువ ధరకే ఇంటర్నెట్ డేటా, కాలింగ్ ఇతర ప్రయోజనాలను అందించిన ఈ ప్లాన్ చాలా కాలంగా వినియోగదారులలో ప్రజాదరణ పొందింది. ఎయిర్‌టెల్ రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ఇది వినియోగదారులకు అపరిమిత లోకల్, STD కాలింగ్‌తో పాటు రోజుకు 1GB హై-స్పీడ్ 4G/5G డేటాను అందించింది. ఇకపై ఎయిర్‌టెల్ యూజర్లు రీఛార్జ్ చేసుకోవాలంటే ఏకంగా రూ.349 మాత్రమే. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటాతో పాటుగా అన్ లిమిటెడ్ కాల్స్,100 SMSలు ఉచితంగా పొందవచ్చు.
అంతేకాకుండా సబ్‌స్క్రైబర్‌లు ఆరు నెలల పాటు ఉచితంగా ఆపిల్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు, ఉచిత ఎయిర్‌టెల్ హెలోట్యూన్స్ , 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియంను కూడా పొందవచ్చు. ఇదిలా ఉండగా కంపెనీ 56,60 రోజుల వ్యాలిడితో ఉన్న రూ. 579, రూ. 619 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లను కూడా నిలిపివేసిందని తెలుస్తోంది.
Also Read : ప్రభుత్వం సంచలన నిర్ణయం.. పన్నీర్ బ్యాన్.. అమ్మితే లక్ష రూపాయలు ఫైన్!
టెలికాం మార్కెట్‌లో కంపెనీల సగటు ఆదాయం (ARPU) పెంచుకునే వ్యూహంలో భాగంగానే ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎయిర్‌టెల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో యూజర్లపై మరింత భారం పడనుంది. ఎయిర్ టెల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల యూజర్లు సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డేటా అవసరం లేదు ఓన్లీ కాల్స్ సరిపోతుంది అనుకునే వారు ఎయిర్ టెల్ లో రూ. 199 ప్లాన్ బెస్ట్ అని చెప్పాలి. 28 రోజుల వ్యాలిడిటితో మొత్తం 2 GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఇంకో రూ.20 అదనంగా కలిపి అంటే రూ. 219 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటితో మొత్తం 3GB డేటాను అందిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి.
Also Read : గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. WGC సంచలన నివేదిక.. త్వరలోనే పెరగనున్న ధరలు









