ఫ్రాన్స్‌లో మొదలైన యూత్ నిరసనల సెగ ఇప్పుడు పొరుగు దేశమైన జర్మనీని తాకింది. పెరుగుతున్న జీవన వ్యయం, ఎడ్యుకేషన్ రంగానికి ఫండ్స్ కోత, పబ్లిక్ సర్వీసుల నిర్లక్ష్యం అలాగే కంపల్సరీ మిలిటరీ సర్వీస్ విధానానికి వ్యతిరేకంగా జర్మనీ వ్యాప్తంగా యువత రోడ్లపైకి వచ్చింది. ‘జెన్‌జీ రెగెల్ట్’ పిలుపుతో శనివారం దేశంలోని దాదాపు 34 నగరాల్లో వేలాది మంది Gen Z యువకులు భారీ ర్యాలీలు నిర్వహించారు. పగటిపూట శాంతియుతంగా సాగిన ఈ ప్రదర్శనలు, రాత్రికి వచ్చేసరికి పలు నగరాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి.

దేశ ఆర్థిక రాజధాని అయిన ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిరసనకారులు తీవ్రస్థాయిలో రెచ్చిపోయారు. మాస్కులు ధరించిన కొందరు దుండగులు మెయిన్ షాపింగ్ స్ట్రీట్‌లోని షాపుల అద్దాలు పగులగొట్టి లూటీలకు పాల్పడ్డారు. చివరికి ఒక గన్ షాపును కూడా టార్గెట్ చేసి తుపాకులు ఎత్తుకెళ్లగా, పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి రెండు గన్స్‌ను రికవర్ చేశారు. పరిస్థితి విషమించడంతో మెయిన్ షాపింగ్ స్ట్రీట్‌ను క్లోజ్ చేసి, బ్యాట్‌మ్యాన్ గెటప్‌లో ఉన్న ఒక నిరసనకారుడితో పాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

రాజధాని బెర్లిన్‌తో పాటు హాంబర్గ్, కొలోన్ నగరాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. హాంబర్గ్‌లో బ్లాక్ డ్రెస్సులు ధరించిన కొందరు బారికేడ్లకు నిప్పుపెట్టి, పోలీసులపై పెట్రోల్ బాంబులు, బాణసంచా, రాళ్లు విసిరారు. బెర్లిన్‌లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కెనన్లు, పెప్పర్ స్ప్రేలను ఉపయోగించారు. ఈ ఘర్షణల్లో 27 మంది పోలీసులు గాయపడగా, 56 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హెస్‌ స్టేట్‌లో దాదాపు 100 మంది లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిస్టులు ఈ హింసలో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read : భూమివైపు దూసుకొస్తున్న నాసా స్విఫ్ట్ టెలిస్కోప్.. ఎక్కడ పడబోతుందంటే?

యువత ప్రధాన డిమాండ్లు ఇవే:

  • ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టార్లకు బడ్జెట్ కేటాయింపులు భారీగా పెంచాలి.

  • పెరిగిన జీవన వ్యయాన్ని తగ్గించి, సంపదను సమానంగా పంచాలి.

  • పబ్లిక్ సర్వీసులకు ఫండ్స్ తగ్గించే చర్యలను తక్షణమే ఆపాలి.

  • నిర్బంధ సైనిక శిక్షణ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి.

శాంతి, స్వేచ్ఛ కోసమే తమ ఉద్యమమని, హింస తమ విధానం కాదని జెన్-జీ లీడర్ లీనా స్పష్టం చేశారు. మరోవైపు, యూనివర్సిటీల్లో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక శిథిలావస్థ భవనాల్లో చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఘర్షణలను జర్మనీ అంతర్గత వ్యవహారాల మంత్రి అలెగ్జాండర్ తీవ్రంగా ఖండించారు. లూటీలు, దాడులకు దిగేవారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఫ్రాన్స్, ఇటలీ, సెర్బియా బాటలోనే ఇప్పుడు జర్మనీ యువత కూడా రోడ్లపైకి రావడంతో యూరప్ వ్యాప్తంగా ఈ ఉద్యమం మరింత విస్తరిస్తోంది.

Also Read : ల్యాబ్‌లోనే బంగారం తయారీ.. పాదరసం నుంచి గోల్డ్ తీసే ఫ్యూజన్ టెక్నాలజీ