Pawan Kalyan Shoulder Injury
Pawan Kalyan Shoulder Injury

స్టార్ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనారోగ్యంపై నిర్మాత బండ్ల గణేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భుజం నొప్పితో ఎంతో నరకం అనుభవించి ఉంటారని భావోద్వేగానికి గురయ్యారు. తాను నిర్మాతగా ఉన్న ఓ సినిమా షూటింగ్ సమయంలో పవన్ పడిపోయారని, ఆ సమయంలో సర్జరీ చేయాల్సి ఉన్నా పవన్ లెక్క చేయకుండా సినిమా పూర్తి చేసి తనకు అద్భుతమైన విజయాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. ఇంతకీ పవన్‌కి ఏమైంది..? ఆయన ఏ సినిమా సమయంలో పడిపోయారు?.. అనే విషయానికొస్తే..

పవన్ కల్యాణ్ నిన్న (సోమవారం) ముంబైలోని కోకిలాబెన్ ధీరూబాయి అంబానీ హాస్పిటల్‌కు వెళ్లారు. తీవ్రమైన భుజాల నొప్పితో (Pawan Kalyan Shoulder Injury) బాధపడిన ఆయన హాస్పిటల్‌లో టెస్ట్‌లు చేయించుకున్నారు. అనంతరం వైద్యులు ఆయనకు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. రొటేటర్ కఫ్‌తో పాటు రెండు భుజాల కండరాల్లో గాయం తీవ్రత ఎక్కువ ఉందని వైద్యులు తెలిపారు. దీంతో పవన్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు.

Also Read : బుడ్డొడి రేంజ్ మాములుగా లేదుగా.. కళ్లు చెదిరే రెమ్యూనరేషన్!

ఈ నేపథ్యంలో పవన్ అనారోగ్యంపై బండ్ల గణేష్ స్పందించారు. దాదాపు 15 ఏళ్లుగా పవన్ ఆ బాధను ఎలా భరించారో అంటూ ఆవేదనకు గురయ్యారు. ఈ పదిహేనేళ్లు నడుము నొప్పి, భుజం నొప్పితో ఎంత నరకం అనుభవించారో తలచుకుంటేనే గుండె బరువెక్కిపోయిందంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘‘గబ్బర్ సింగ్’ షూటింగ్ సమయంలో గుజరాత్‌లో మీకు జరిగిన ప్రమాదం ఈ రోజుకీ నా కళ్లముందే కనిపిస్తుంది. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పినా.. మీరు ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఇప్పటికీ నా మనసులో మెదులుతూనే ఉంది.

ముందు సినిమా పూర్తి చేద్దాం.. నిర్మాతకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు.. ఎంతో మంది కష్టపడుతున్నారు.. అని ఆపరేషన్‌ను వాయిదా వేసి షూటింగ్ పూర్తి చేశారు. అప్పుడు మీరు నాకు ఇచ్చింది ఒక హిట్ సినిమా మాత్రమే కాదు.. లైఫ్ లాంగ్ మర్చిపోలేని రుణం. దానిని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. ఆ దేవుడిని ఒక్కటే కోరుకుంటున్నాను. ఇకపై మీరు ఆనందంగా, సంతోషంగా ఉండాలి.’’ అంటూ బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు.

Also Read : కొరటాల, బాలయ్య సినిమా షురూ.. మామ సినిమాకు అల్లుడు క్లాప్!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.