
నటసింహం నందమూరి బాలకృష్ణ వరుసగా భారీ బడ్జెట్ సినిమాలను లైన్లో పెడుతూ బాక్సాఫీస్ వద్ద అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ప్రస్తుతం ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 111 షూటింగ్‌తో బిజీగా ఉండగానే.. తాజాగా తన తదుపరి చిత్రం NBK 112ను అధికారికంగా ప్రారంభించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలు గురువారం నాడు అమరావతిలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరై చిత్ర యూనిట్‌కు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి ముందే చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బాలకృష్ణ క్రేజ్‌కు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల నుండి రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలలో నిర్మిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఈ సినిమాను కేవలం టాలీవుడ్‌కే పరిమితం చేయకుండా, అన్ని ప్రధాన భాషల్లో పాన్ ఇండియా ఎంటర్టైనర్ గా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నట్లు స్పష్టం చేశారు.
Also Read : రూమర్స్‌కు ఒకే ఒక్క ఫొటోతో చెక్: సీఎం విజయ్‌కు త్రిష అదిరిపోయే బర్త్‌డే సర్ప్రైజ్..
ఆగస్టు నుంచి రెగ్యూలర్ షూటింగ్
ఈ ఏడాది (2026) ఆగస్టు నెల నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. అంతా అనుకున్నట్లు జరిగితే, వచ్చే ఏడాది అంటే 2027 వేసవి కానుకగా ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. దీనితో NBK 112 చిత్రం అప్పుడే 2027 సమ్మర్ రేస్‌లో అధికారికంగా అడుగుపెట్టినట్లయింది. ఈ భారీ పోటీలో రాబోయే రోజుల్లో ఇంకా ఏయే పెద్ద సినిమాలు నిలుస్తాయో చూడాలి. ఈ చిత్రాన్ని యువసుధ ఆర్ట్స్ సంస్థతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా, సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ భారీ పాన్ ఇండియా చిత్రానికి సౌత్ ఇండియా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read : హీరోయిన్ శ్రీలీలకు ఘోర అవమానం.. స్టేజ్ పైనే షాకిచ్చిన సీఎం భార్య!









