revanth

Revanth : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెతను చైల్డ్ ఆరిస్ట్ రేవంత్ బాగానే ఫాలో అవుతున్నాడు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా తనదైన కామెడీ టైమింగ్, అమాయకపు నటనతో థియేటర్లలో నవ్వుల రైలు పూయించిన ఈ బుడ్డోడి హవా ఇప్పుడు టాలీవుడ్‌లో నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది.

ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా రేవంత్‌కు బెస్ట్ చైల్డ్ కమెడియన్‌గా అవార్డులను కూడా తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న ఈ చైల్డ్ సెన్సేషన్.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ అండ్ మోస్ట్ ఇన్-డిమాండ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా మారిపోయాడు.

Also Read : ఫిక్స్ .. త్వరలో అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి

టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్స్ నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. బుల్లిరాజు క్రేజ్ చూసి మేకర్స్ భారీ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రోజుకు దాదాపు లక్ష రూపాయల పారితోషికం చార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ రేంజ్ రెమ్యూనరేషన్ టాలీవుడ్‌లో ఒక చైల్డ్ ఆర్టిస్ట్‌కు దక్కడం చాలా అరుదనే చెప్పాలి. కేవలం డేట్స్ కోసమే పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్‌లు క్యూ కడుతుండటం విశేషం.

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ డైరెక్షన్ లో రాబోతున్న మల్టీస్టారర్ లైనప్‌లో రేవంత్ ఒక కీలక పాత్ర చేయబోతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతోంది.

ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇది రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండటంతో ఫ్యాక్షన్ సినిమా ఏమో అని అందరూ అనుకున్నారు. కానీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆ అపోహలను క్లియర్ చేశారు. ఇది సీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక కంప్లీట్ హెలారియస్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని స్పష్టం చేశారు. కీర్తి సురేష్ , కృతి శెట్టి ఇందులో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ భారీ మల్టీస్టారర్‌ను వచ్చే ఏడాది 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : తెలంగాణ ఉద్యమకారుడు, సినీ నిర్మాత పద్మారావు కన్నుమూత!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.